Viral video: పాములు వేటాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?

by Yella Dhawani Reddy |

సాధారణంగా పాములంటే భయపడని వారుండరు. అదిగో పాము అంటే.. ఇదిగో పరుగు అంటాం.

Viral video: పాములు వేటాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాములంటే (Snakes) భయపడని వారుండరు. అదిగో పాము అంటే.. ఇదిగో పరుగు అంటాం. ఎందుకంటే.. అవి ఒక్కసారి కాటేస్తే అంతే సంగతి. ఇక పాముల ఆహారం (Snakes food) విషయానికి వస్తే.. కీటకాలు, బల్లులు, ఎలుకలు, కప్పల వంటి చిన్న చిన్న జీవులను వేటాడి చంపి తింటాయి. చాలా సార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. అయితే ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌ (Viral) అవుతుంది. ఇందులో పాములు ఆహారం కోసం ఎంత చాకచక్యంగా వేటాడుతాయో చూడొచ్చు.

ఈ వీడియోలో ఖాళీ ప్రదేశంలో ఓ కప్ప కూర్చుని ఉండగా ఓ పాము మెల్లిగా దాని వైపు వస్తుంది. పాము రావటం గమనించిన ఆ కప్ప పరుగు ప్రారంభించింది. అది చూసిన పాము కూడా స్పీడ్ పెంచింది. అయితే, కొద్ది దూరం వెళ్లి కప్ప ఆగింది. వెంటనే పాము దాన్ని దగ్గరికి వచ్చి నోటితో అందుకోబోయింది. కప్ప తృటిలో తప్పించుకుని మళ్లీ పరుగు ప్రారంభించింది. అయితే, కప్ప కొద్దీ దూరం వెళ్లాక అలసిపోయి ఆగిపోయింది. ఆ పాము మాత్రం కప్పను చంపటమే లక్ష్యంగా వదలకుండా వేటాడి చివరకు నోటితో దాన్ని అదుకుంది. తప్పించుకునేందుకు కప్ప ప్రయత్నించినప్పటికీ పాముకు ఆహారంగా మారిపోవాల్సి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు పాపం కప్ప అంటూ జాలి పడుతున్నారు. ఇంకొందరు పాములు ఇలా వేటాడుతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story