- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి రన్స్ మీరెప్పుడైనా చూసారా? తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం
క్రికెట్ మైదానంలో ప్రతి మ్యాచ్‌పై ఉత్కంఠ ఉండటం సహజం. కానీ కొన్నిసార్లు ఆటలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుని ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పిస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ (Cricket) మైదానంలో ప్రతి మ్యాచ్‌పై ఉత్కంఠ ఉండటం సహజం. కానీ కొన్నిసార్లు ఆటలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుని ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పిస్తుంటాయి. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ (Tamil Nadu Premier League) 2025 మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుంది. శనివారం సీచెమ్ మదురై పాంథర్స్ వర్సెస్ దిండిగుల్ డ్రాగన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిండిగుల్ డ్రాగన్స్ టీంకు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) నాయకత్వం వహిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన మదురై పాంథర్స్ 20 ఓవర్లలో 150 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. అయితే, ఇన్నింగ్స్ చివర్లో జరిగిన ఓ ఘటన అభిమానులను స్మార్ట్ ఫీల్డింగ్‌పై, అలాగే తడబాటు నిర్ణయాలపై చర్చించుకునేలా చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో, ఐదో బంతిని ఎదుర్కొన్న గుర్జప్‌నీత్ సింగ్, షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ బంతిని అందుకొని వెంటనే నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. కానీ, బంతి వికెట్లను తాకకపోవడంతో.. బ్యాటర్లు మరో రన్ కోసం కూడా వెళ్లిపోయారు.
ఇంతలో మరో ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసిరాడు. కానీ అక్కడ కూడా బంతి చేజారింది. దీంతో మదురై జట్టు బ్యాటర్లు మూడో పరుగును కూడా సులభంగా పూర్తి చేశారు. వాస్తవానికి నాలుగో పరుగు కూడా దాదాపు పూర్తయ్యేది. కానీ ఆ సమయంలో ఫీల్డర్ తెలివిగా వ్యవహరించి బంతిని విసరకుండా నిలిపివేశాడు. ఈ మొత్తం సంఘటనను కెమెరాలు బంధించగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ సంఘటనను చూసి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఇది IPL లో జరిగితే ఎలా ఉండేది!' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 151 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన దిండిగుల్ డ్రాగన్స్ జట్టు కేవలం 12.3 ఓవర్లలోనే విజయం సాధించింది.






