ఇలాంటి ఫ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? ధనికులు మాత్రమే వినియోగించేవారట!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-25 14:21:51  IST  )

ప్రస్తుతం ప్రతి ఇంట్లో సర్వసాధారణమైన వస్తువు ఫ్యాన్.

ఇలాంటి ఫ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? ధనికులు మాత్రమే వినియోగించేవారట!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రతి ఇంట్లో సర్వసాధారణమైన వస్తువు ఫ్యాన్ (Fan). అలాగే, సీలింగ్ ఫ్యాన్ అని, టేబుల్ ఫ్యాన్ అని, వాల్ మౌంట్ ఫ్యాన్ అని ఇలా రకరకాల ఫ్యాన్లు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ ఫ్యాన్లు ఒకప్పుడు ప్రీమియం (Premium) హోదాలో ఉండేవి. అంటే కేవలం ధనవంతుల (Rich people) ఇళ్లలో మాత్రమే కనిపించేవి. 1920లలో ధనిక వాణిజ్యవేత్తలు, జమీందార్లు, రాజులు మాత్రమే ఫ్యాన్ సౌకర్యాన్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకునేవారట. అతిథుల ముందు తమ హోదా ప్రదర్శించేందుకు వీటిని సాధారణంగా డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ హాల్‌లో అమర్చుకునేవారట. ఇక సామాన్య ప్రజలు దీన్ని ఒక విలాసవంతమైన వస్తువుగా చూసేవారట.

పైగా ప్రస్తుతం మనం చూసున్న ఫ్యాన్లకు మూడు రెక్కలు ఉంటాయి. సీలింగ్ ఫ్యాన్ అయితే, అది అమర్చిన చోట కిందవైపు గాలి ఇస్తుంది. టేబుల్ ఫ్యాన్ అయితే మనకు కావాల్సిన చోట పెట్టుకుని వాడుకోవచ్చు. ఇక వాల్ మౌంట్ ఫ్యాన్లు అయితే అటు ఇటు 180 డిగ్రీలు తిరుగుతూ గాలిని అందిస్తాయి. కానీ, అప్పట్లో ఫ్యాన్ల డిజైన్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఇది గదిలో 360 డిగ్రీలు గాలిని వ్యాపించేవి. సీలింగ్‌కు వేలాడే ఈ ఫ్యాన్ల ఆకారం మధ్యలో గుండ్రంగా ఉండి దానికి రెండు వైపుల రెక్కలు అమర్చి ఉండేవి. ఇక ఆన్ చేయగానే గుండ్రంగా చుట్టూ తిరుగేవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ఫ్యాన్ చూడటం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Next Story