- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ఇలాంటి వెల్ కమ్ ఎప్పుడైనా చూశారా? నెట్టింట అద్భుతమైన దృశ్యం

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులునూ పెంచుకోవటం చూస్తుంటాం. వాటిని తమ పిల్లల్లా ప్రేమగా చూసుకుంటుంటారు. ఇక పెంపుడు జంతువులు కూడా తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటాయి. యజమానులతో ఆటలు ఆడుతూ, ఇంట్లో అల్లరి చేస్తూ సరదాగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు కూడా నెట్టింట బోలెడు వైరల్ అవుతుంటాయి. ఇక కుక్కలు, పిల్లులతో పాటు చాలా మంది కోళ్లను కూడా ఇళ్లలో పెంచుకుంటారు. కానీ, అవి తమ యజమానులతో సరదాగా ఉండే సన్నివేశాలు చాలా అరుదు. అయితే, తాజాగా ఇలాంటి ఓ అద్భుతమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, మనుషులతో కోళ్లు కూడా అనుబంధాన్ని ఏర్పర్చుకుంటాయని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
ఓ అమ్మాయి కోడిని పెంచుకుంటుంది. ఇందులో వింతేముంది.. సాధారణంగా చాలా మంది ఇళ్లలో కోళ్లను పెంచుకుంటారు కదా అని అనుకోవచ్చు. కానీ, ఈ కోడి చాలా స్పెషల్. ఎందుకంటే.. రోజు సాయంత్రం ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే సమయానికి ఈ కోడి బస్టాప్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి స్వయంగా స్వాగతం పలుకుతోంది. వీడియోలో ఓ కోడి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు దిగి వస్తున్న తన యజమానికి స్వాగతం పలికింది. తర్వాత అమ్మాయితో కలిసి కోడి నడుచుకుంటూ వచ్చింది. కొంచెం దూరం రాగానే ఆ అమ్మాయి కోడిని ప్రేమగా ఎత్తుకుని తీసుకెళ్లింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 'AI ఇలాంటి దృశ్యాన్ని ఎప్పటికీ సృష్టించలేదు' అని కొందరు, ఇదో అందమైన దృశ్యం అంటూ మరికొందరు, ఈ వీడియో జంతువులు, మనుషుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని చూపిస్తుందంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.






