- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వావ్.. ఏం తెలివిరా బుడ్డోడా.. నీలో సగం బ్రెయిన్ మేం వాడినా చాలు అంటున్న నెటిజన్స్..(వీడియో)
చిన్న పిల్లలు చేసే పనులు చూస్తే ముచ్చటేస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఎలా ఆలోచిస్తారనిపిస్తుంది. ఒక్కోసారి గర్వంగా కూడా ఉంటుంది. అలాంటి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే వీడియోనే ఇది కూడా. విషయం ఏంటంటే... ఓ బుడ్డోడు మంచి నీళ్లు తాగాలని అనుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పిల్లలు చేసే పనులు చూస్తే ముచ్చటేస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఎలా ఆలోచిస్తారనిపిస్తుంది. ఒక్కోసారి గర్వంగా కూడా ఉంటుంది. అలాంటి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే వీడియోనే ఇది కూడా. విషయం ఏంటంటే... ఓ బుడ్డోడు మంచి నీళ్లు తాగాలని అనుకున్నాడు. హ్యాండ్ పంప్ కొట్టి గ్లాసులో నీళ్లు పట్టుకోవాలి. కానీ చుట్టుపక్కల హెల్ప్ చేసేందుకు ఎవరు లేరా లేక ఎవరి హెల్ప్ నాకెందుకులే అనుకున్నాడో ఏమో.. కనీసం చేతి పంప్ ఎత్తులో కూడా లేని బుడ్డోడు చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. హ్యాండ్ పంప్ అందకపోవడంతో... కింద గ్లాస్ పెట్టిన చిన్నోడు.. పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి.. తర్వాత చేతి పంపుమీద కూర్చుని.. కిందకు మీదకు ఊగాడు. ఖతమ్.. నీళ్లు వచ్చేశాయ్.. గ్లాసు నిండింది. హాయిగా తాగేశాడు.
ఈ వీడియోకు ఫిదా అయిపోయిన జనాలు రీషేర్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసిన సూపర్ వీడియో అని... ఏం తెలివిరా బుడ్డోడా.. నీలో సగం తెలివి వాడినా ఎప్పుడో బాగుపడే వాళ్లమని అంటున్నారు నెటిజన్లు. బుడ్డోడే కానీ మహానుభావుడు.. వీడు ఫ్యూచర్‌లో కచ్చితంగా హీరో అవుతాడని కొందరు అంటుంటే.. బిజినెస్ చెయ్యరా పొట్టోడా ఇండియాను ఏలేస్తావ్ అంటున్నారు ఇంకొందరు.






