అతని ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఏనుగు పిల్లకు గోరుముద్దలు పెట్టిన వ్యక్తి(వైరల్ వీడియో)

by Jakkula.Mamatha |

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో జంతువులకు సంబంధించిన వీడియో(Vidios)లు వైరల్(Viral) అవుతుండడం గమనిస్తూనే ఉన్నాం.

అతని ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఏనుగు పిల్లకు గోరుముద్దలు పెట్టిన వ్యక్తి(వైరల్ వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో జంతువులకు సంబంధించిన వీడియో(Vidios)లు వైరల్(Viral) అవుతుండడం గమనిస్తూనే ఉన్నాం. జంతువులు, పక్షులు చేసే వింత పనులు చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు జంతువులను చూస్తే భయం వేస్తుంటుంది. కానీ.. వాస్తవానికి జంతువులు మన ప్రవర్తన బట్టి.. వాటి ప్రవర్తనను మార్చుకుంటాయనడంలో ఆశ్చర్యం లేదు.

మనం జంతువుల(Animals)ను మచ్చిక చేసుకుంటే.. అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల పక్షులను పెంచుకోవడం గమనిస్తూనే ఉంటాం. అంతే కాదు కొన్ని సార్లు మనసు బాగోలేక పోయిన ‘జూ పార్క్’కి వెళ్లి అక్కడ ఉన్న జంతువుల చేష్టలు చూస్తూ గడిపేస్తుంటారు. ఈ క్రమంలో వాటికి ఏదైనా ఆహారం కూడా పెడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుండడం అందరికీ తెలిసిందే. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఏనుగు పిల్లకే(Baby elephant) గోరుముద్దలు పెడుతున్నాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అటవీ అధికారుల సంరక్షణలో ఉన్న ఓ ఏనుగు పిల్ల(Baby elephant)కు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిడ్డకు తల్లి గోరుముద్దలు పెట్టినట్లు కేర్ టేకర్ దానికి ఆహారం తినిపించారు. అయితే.. పిల్లలు గోరుముద్దలు తినిపిస్తుంటే వద్దు.. వద్దు.. అని మారం చేస్తారు. కానీ.. ఆ చిట్టి ఏనుగు పిల్ల ఆహారం వద్దని పిల్లల లాగా మారం చేయలేదు. ఎంచక్కా మొత్తం తినేసింది. దీనిని ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి షేర్ చేస్తు ‘ఈ బ్యూటిఫుల్ వీడియో చూడండి.. మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ వీడియోను లూప్ లో చూడండి’’ అని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Next Story