- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబానీ కుక్క రేంజ్ రూ.3 కోట్లు.. స్పెషల్ గా బెంజ్ కారు కూడా !
ముఖేష్ అంబానీ ( mukesh ambani)... ఇండియాలోనే అపర కుబేరుడు. ఎన్నో రకాల బిజినెస్ లు నడిపిస్తూ... చాలామందికి

ముఖేష్ అంబానీ ( mukesh ambani)... ఇండియాలోనే అపర కుబేరుడు. ఎన్నో రకాల బిజినెస్ లు నడిపిస్తూ... చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటిది... ఆయనదిశ, వెబ్ డెస్క్: ముఖేష్ అంబానీ ( mukesh ambani)... ఇండియాలోనే అపర కుబేరుడు. ఎన్నో రకాల బిజినెస్ లు నడిపిస్తూ... చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటిది... ఆయన ఇంట్లో ఓ కుక్క ( Dog ) చనిపోతే... పెద్ద వార్త అవుతుంది. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన కుక్క గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. బుధవారం రోజున... ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న హ్యాపీ అనే పెంపుడు కుక్క కన్ను మూసింది.
ఈ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు.. అధికారికంగా ప్రకటించారు. ఈ హ్యాపీ అంటే... అంబానీ కుమారుడు అనంత్ కు ( Ananth ambani) చాలా ఇష్టం. అనంత అలాగే రాధిక ( Radhika) పెళ్లి సమయంలో కూడా ఈ పెంపుడు కుక్క.. బాగా వైరల్ అయింది. ఆ పెంపుడు కుక్కకు కూడా కాస్ట్లీ బట్టలు వేశారు. అయితే అలాంటి పెంపుడు కుక్క చనిపోవడంతో అంబానీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ పెంపుడు కుక్క మరణించడంతో... ఆ కుక్క గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక పది పేద కుటుంబాలు.. 10 సంవత్సరాలు.. కూర్చుని తినేలా... దాని మెయింటెనెన్స్ ఉంటుందట. ముఖ్యంగా హ్యాపీ ( Happy ) అనే పెంపుడు కుక్క తిరిగేందుకు ప్రత్యేక కారును ( Car) కూడా కొనుగోలు చేసిందట అంబానీ కుటుంబం.
ప్రతిరోజు ఆ కారులో సాయంత్రం షికారుకు వెళుతుందట హ్యాపీ. ఏకంగా మూడు కోట్లు పెట్టి... మెర్సిడెస్-బెంజ్ G400d లగ్జరీ SUVకారును ( Mercedes-Benz G400d luxury SUV)... హ్యాపీ కోసమే కొనుగోలు చేసింది అంబానీ కుటుంబం. ఆ కారుకు ప్రత్యేక డ్రైవర్... మెయింటెనెన్స్ కోసం మరో వ్యక్తి కూడా ఉంటారట. ప్రతిరోజు సాయంత్రం ముంబై వీధుల్లో కుక్కను ఆ కారులోనే దింపుతారని సమాచారం. ఈ కారు డీజిల్ వేరియంట్ అని తెలుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. మనుషులకే లేదు రా అంటే... కుక్కలకు కూడా కారు ఏంటి ? అని చాలా మంది అవాక్కైపోతున్నారు.






