- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటన..బోరింగ్ తీయకుండా రోడ్డు వేసిన అధికారులు
CM యోగి వస్తున్నాడన్న హడావిడి నేపథ్యంలో రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు అధికారులు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ( UP) రాష్ట్రంలో మరో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో PWD ఇంజనీర్ల నిర్లక్ష్యం బయటపడింది. ముఖ్యమంత్రి యోగి వస్తున్నాడన్న హడావిడి నేపథ్యంలో రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు అధికారులు. రోడ్డు మధ్యలోనే బోరింగ్ పంపు (Hand pump ) ఉన్నప్పటికీ కొత్త రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు వేశామా ? లేదా అన్నట్లుగా కాంట్రాక్టర్, అధికారుల తీరు ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా కాంతిత్ చోటు చేసుకుంది.
ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. అయితే సీఎం యోగి వస్తున్నాడన్న ఒక్క కారణం నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే మీర్జాపూర్ జిల్లా కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్ గా చేశారు.
అయితే ఈ నేపథ్యంలోనే కాంతిత్ ప్రాంతంలో బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఉత్తరప్రదేశ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన ముఖ్యమంత్రి దాకా చేరినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే నడిరోడ్డు పైన ఉన్న బోరింగ్ ను కాస్త తొలగించారు అధికారులు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.






