Guinness World Records: ఒంటిపై స్పూన్లతో గిన్నిస్‌ రికార్డు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-23 12:30:21  IST  )

గిన్నిస్ రికార్డులో చోటు దక్కాలంటే ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉండాలి.

Guinness World Records: ఒంటిపై స్పూన్లతో గిన్నిస్‌ రికార్డు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
X

దిశ, వెబ్ డెస్క్: గిన్నిస్ రికార్డులో (Guinness world record) చోటు దక్కాలంటే ఏదైనా ప్రత్యేక ప్రతిభ (Special talent) ఉండాలి. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పొట్టివాళ్లు, అతి పొడవైన వాళ్లు, అతి పెద్దవయస్కులు, కళ్లకు గంతలు కట్టుకుని కూరగాయలు కోసే వ్యక్తులు, పొడవైన గోర్లు ఉన్న వ్యక్తులు.. ఇలా ఎంతో మంది తమ ప్రత్యేకతలు చాటుకొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్‌కు (Iran) చెందిన వ్యక్తి కూడా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. అయితే, ఇతడు రికార్డు సాధించిన విషయం తెలిస్తే ఎవ్వరైనా సరే అసలు అదేలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోవాల్సిందే. మరీ ఆ విషయాలేంటో తెలుసుకుందామా.

ఇరాన్‌కు చెందిన 54 ఏళ్ల అబోల్ఫజల్‌ సాబెర్‌ మొఖ్తరి (Abolfazl Saber Mokhtari) శరీరంపై టేబుల్ స్పూన్లను ఎలాంటి ఆధారం లేకుండా అతికించుకుని రికార్డులు సాధిస్తున్నాడు. తొలిసారిగా 2021లో ఒంటిపై 64 స్పూన్లను బ్యాలెన్స్ చేసుకుని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. అనంతరం, 2023లో 85 స్పూన్లు నిలబెట్టుకుని తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఏకంగా 96 స్పూన్లు ఒంటిపై నిలబెట్టుకుని రెండోసారి తన రికార్డును బద్దలు కొట్టి మూడోసారి గిన్నిస్‌ రికార్డును సాధించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాలుగా స్పందిస్తున్నారు. బహుశ అతనికి అరుదైన శరీక్ష లక్షణాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక వీడియోలో మొఖ్తరి చొక్కా లేకుండా నిలబడి ఉండగా, ఒక అమ్మాయి చెంచాలను జాగ్రత్తగా అతనిపై ఉంచుతున్నాడు. మొఖర్తి పూర్తిగా నిశ్చలంగా ఉండి, వీడియో ముగిసే వరకు ఒక్క చెంచా కూడా కింద పడకుండా, స్థిరంగా, ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ కనిపిస్తున్నాడు.

Next Story