- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిలో ఎనిమిదో ప్రమాణం చేసిన వరుడు.. నవ్వులే నవ్వులు
హిందూ వివాహంలో పెళ్లి పీటలపై కూర్చుని పెళ్లి చేసుకునే జంటతో పండితులు సప్తపది తంతు జరిపిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: హిందూ వివాహంలో పెళ్లి పీటలపై కూర్చుని పెళ్లి చేసుకునే జంటతో పండితులు సప్తపది తంతు జరిపిస్తారు. ఇందులో వారిద్దరి చేత ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అంటూ.. ఏడు ప్రమాణాలు చేయిస్తారు. వీటి గురించి దాదాపు మనందరికీ తెలుసు. అయితే ఓ వరుడు తమ పెళ్లిలో ఎనిమిదో ప్రమాణం కూడా చేశాడు. ఆ ప్రమాణం అక్కడున్న వారందరినీ నవ్వించింది.
మయాంక్ - దియా అనే వధూవరుల పెళ్లి ఢిల్లీలో ఘనంగా.. అంగరంగ వైభవంగా జరిగింది. సప్తపదిలో ఏడు ప్రమాణాలు చేశారు. ఆ తర్వాత వరుడు చేసిన మరో ప్రమాణం అందరినీ నవ్వించింది. "ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ టెంపరేచర్ ను నేనే నియంత్రిస్తాను" అని మయాంక్ 8వ ప్రమాణం చేశాడు. సడెన్ గా మైక్ తీసుకుని ఈ విషయం చెప్పడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భార్యను ముందే గ్రిప్ లో పెట్టుకుంటున్నావా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






