- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షం...పెళ్లి కొడుకుని ఎత్తుకుని వాగు దాటించిన బంధువులు..!
పెళ్ళికొడుకును బంధువులందరూ చాలా జాగ్రత్తగా భుజాలపై ఎత్తుకొని వాగు దాటించారు

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన వర్షాలు... ఎక్కడా తగ్గడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలాగే కుంటలు మత్తళ్ళు దుంకుతున్నాయి. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో... కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలోనే... ఈ భారీ వర్షం ఓ పెళ్లికి అడ్డుగా మారింది.
దీంతో పెళ్లి కొడుకును వాగు దాటించాల్సి వచ్చింది. బంధువులందరూ పెళ్ళికొడుకును ఎత్తుకొని మరీ ఆ వాగు దాటించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. భారీ వర్షం నేపథ్యంలో.. వాగులు బాగా ప్రవహించి.. చిన్న బ్రిడ్జిలు మొత్తం మునిగిపోయాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామానికి రాకపోకలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి కొడుకు ఉన్న కారు 4 గంటలుగా వాగు దాటేందుకు ప్రయత్నం చేసింది. అయినా లాభం లేకపోయింది. వాగు దాటనివ్వలేదు. ఇక ముహూర్త సమయం దగ్గర పడడంతో.. పెళ్ళి కొడుకును బంధువులందరూ చాలా జాగ్రత్తగా భుజాలపై ఎత్తుకొని వాగు దాటించారు. అనంతరం ఆ వివాహ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్






