ఎల్లమ్మ పాటకు ఇరగదీసిన బామ్మ.. నెట్టింట్లో వీడియో వైరల్

by Muthe.Rajitha |

సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు క్రిష్ణా రామా అనుకుంటారు. కళ్ళు కనిపించక, చెవులు వినిపించక.. నాలుగు అడుగులు కూడా చలాగ్గా నడవలేరు.

ఎల్లమ్మ పాటకు ఇరగదీసిన బామ్మ.. నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు క్రిష్ణా రామా అనుకుంటారు. కళ్ళు కనిపించక, చెవులు వినిపించక.. నాలుగు అడుగులు కూడా చలాగ్గా నడవలేరు. కానీ ఒక 70 ఏళ్ల బామ్మ మాత్రం యూత్ కి ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేసింది. అయితే ఆ ప్రదేశం వివరాలు పూర్తిగా తెలియకపోయినా.. కరీంనగర్ జిల్లాలో అని మాత్రం తెలుస్తోంది.

ఎదో ఫంక్షన్ అయ్యాక పాటలు పెట్టుకొని అందరూ చిందేస్తుంటే.. ఎల్లమ్మ పాటకు ఆ బామ్మ కూడా సూపర్ గా చిందేసింది. అక్కడున్నవాళ్ళు చప్పట్లు, ఈళలతో మరింత హుషారెత్తించగా.. ఇంకాస్త ఉత్సాహంగా కాలు కదిపింది. ఆమె డ్యాన్స్ కు మెచ్చి డబ్బులు బామ్మ మీది నుంచి తిప్పారు అంటే అర్థం చేసుకోండి బామ్మ డ్యాన్స్ సంగతి. మరి ఆ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మీరు కూడా చూసేయండి.

Next Story