- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ బండిపై అవ్వను ఎక్కించుకుని తాత రైడింగ్.. నెటిజన్లు ఫిదా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి అంటే యువతలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బుల్లెట్ బండి అంటే యువతలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రోడ్డుపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తూ.. గాల్లో విహారిస్తూ.. ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంతేకాదు, బుల్లెట్‌పై ప్రయాణించటం అంటే కేవలం ఒక రైడ్ మాత్రమే కాదు.. అది ఓ ఎమోషన్, ఓ స్టేటస్, ఓ గర్వంలాగా భావిస్తుంటారు. అయితే, తాజాగా నెట్టింట బుల్లెట్‌పై యువతకు ఉండే క్రేజ్‌ను మించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
సాధారణంగా వృద్ధాప్యం అంటే వారి పనులకే మరొకరి సాయం కోరుతుంటారు. ఇక వాహనాలు నడిపించే శక్తి ఏముంటుంది అనుకుంటారు. అందులోనూ బుల్లెట్ బైక్ చాలా బరువు ఉంటుంది. అందుకే వృద్ధులు ఈ వాహనాలను డ్రైవ్ చేయడం చాలా తక్కువ. అలాంటిది ఓ పెద్దాయన ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వాయు వేగంతో దూసుకెళ్లాడు. దాదాపు 60 ఏళ్లకు పైబడిన వృద్ధ దంపతులిద్దరూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ టైటానికి ( Royal Enfield Titanic )పై దూసుకెళ్లారు. ఆ దంపతులు బుల్లెట్‌పై దూసుకెళ్లిన తీరు.. వాహనదారులను, ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంది.
ఈ క్లిప్‌ను ఓ ప్రయాణికుడు తన కారు నుంచి తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అద్భుత స్పందన వచ్చింది. వీడియో ప్రారంభంలో వృద్ధ దంపతులు నెమ్మదిగా బైక్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. మోటార్ సైకిల్‌ను ఒక వృద్ధ వ్యక్తి నడుపుతుండగా, అతడి వెనుకవైపు, పక్కకి కూర్చుని, చీర కట్టులో ఉన్న అతడి భార్య – ఎంతో ఆత్మీయతతో అతని భుజాన్ని పట్టుకుని ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కారులో ఉన్న మహిళ 'అమెజింగ్' అంటూ వారిని కితాబిచ్చింది. అప్పుడే బైక్ నడుపుతున్న వృద్ధ వ్యక్తి చిరునవ్వుతో ఆమెకి స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దృశ్యం మహారాష్ట్ర( Maharashtra )లోని ఓ రహదారిపై కనిపించింది.






