Lil Nas X : వీధుల్లో నగ్నంగా తిరుగుతూ రచ్చ చేసిన సింగర్..ఇండస్ట్రీలో మరో దుమారం

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-22 06:44:16  IST  )

గ్రామీ అవార్డు విన్నింగ్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ వీధుల్లో నగ్నంగా తిరుగుతూ దర్శనమిచ్చాడు. లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియో సిటీలో ఉదయం నాలుగు గంటలకు బట్టలు లేకుండా తిరిగాడు. వింతగా ప్రవర్తించాడు. సంబంధం లేకుండా మాట్లాడుతూ హల్ చల్ చేశాడు

Lil Nas X  : వీధుల్లో నగ్నంగా తిరుగుతూ రచ్చ చేసిన సింగర్..ఇండస్ట్రీలో మరో దుమారం
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామీ అవార్డు విన్నింగ్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ వీధుల్లో నగ్నంగా తిరుగుతూ దర్శనమిచ్చాడు. లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియో సిటీలో ఉదయం నాలుగు గంటలకు బట్టలు లేకుండా తిరిగాడు. వింతగా ప్రవర్తించాడు. సంబంధం లేకుండా మాట్లాడుతూ హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతన్ని కంట్రోల్ చేసేందుకు దాడి చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే జనాల అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నాడని కొందరు భావిస్తుంటే.. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల పిచ్చిగా ప్రవర్తించాడని, హాస్పిటల్‌లో చేర్పించారని మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రచురించాయి.

కాగా ‘ఓల్డ్ టౌన్ రోడ్’ ఆల్బమ్‌కు 2020లో రెండు గ్రామీ అవార్డులు పొందిన రాపర్ లిల్ నాస్ ఎక్స్.. కాంట్రవర్షియల్ సాంగ్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. 2021 ‘మోంటెరో’ మ్యూజిక్ వీడియో, 2024 ‘జై క్రిస్ట్’ సింగిల్ ద్వారా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ర్యాపర్. సాతానిక్ థీమ్స్, మతపరమైన చిత్రాలను అసభ్యకరంగా చూపించడం ఇందుకు కారణం. కాగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని.. తన ప్రొఫెషనల్ వర్క్‌ను ప్రతిబింబించడమే లక్ష్యమని వివరించాడు. దీంతో ఆయనకు ప్రేక్షకులు దూరమయ్యారనే వార్తలు వచ్చినా.. మిలియన్ల స్ట్రీమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆయన డ్రగ్ అడిక్ట్ కావడం, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తుండటంతో.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

VIDEO

Next Story