ప్రకృతి ప్రేమికులకు తీపికబురు.. బొగత జలపాతం సందర్శనకు అనుమతి

by Kema Shiva Kumar |

ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism Department) మరో గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రకృతి ప్రేమికులకు తీపికబురు.. బొగత జలపాతం సందర్శనకు అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism Department) మరో గుడ్ న్యూస్ చెప్పింది. బొగత వాటర్‌ఫాల్స్ (Bogatha Waterfalls) సందర్శనకు అనుమతిస్తున్నట్లుగా తాజాగా అధికారులు ప్రకటనను విడుదల చేశారు. అయితే, వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతానికి ఎగువ నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకులను అక్కడికి అనుమతించలేదు. ప్రస్తుతం వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో ఆంక్షలను సడలిస్తూ.. వాటర్‌ఫాల్స్ సందర్శనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ, పర్యాటకులు దూరం నుంచి మాత్రమే జలపాతాన్ని వీక్షించాలని అందులోకి దిగేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. కాగా, బొగత జలపాతం వద్ద డ్రోన్‌ విజువల్స్ మానస సరోవరాన్ని తలపిస్తున్నాయని నేచర్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

Next Story