బతికున్న పాములను మెడలో వేసుకుని డ్యాన్సులు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-04 11:04:23  IST  )

రాజస్థాన్‌లో తేజ దశమి సందర్భంగా గోగాజీ మేళా ఘనంగా నిర్వహిస్తారు. సాధారణంగా భాద్రపద మాసం శుక్ల పక్ష దశమిన తమ శక్తివంతమైన కుల దేవుడు గోగాజీ మహారాజ్‌ను కొలుచుకుంటారు కాల్చేలియా, సపేరా కమ్యూనిటీ ప్రజలు. వీరు పాములను

బతికున్న పాములను మెడలో వేసుకుని డ్యాన్సులు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లో తేజ దశమి సందర్భంగా గోగాజీ మేళా ఘనంగా నిర్వహిస్తారు. సాధారణంగా భాద్రపద మాసం శుక్ల పక్ష దశమిన తమ శక్తివంతమైన కుల దేవుడు గోగాజీ మహారాజ్‌ను కొలుచుకుంటారు కాల్చేలియా, సపేరా కమ్యూనిటీ ప్రజలు. వీరు పాములను ఆడించే వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తుండగా.. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఈ గోగాజీ మహారాజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాముల ఆడించే వీరు.. ఈ పండుగ పూట మెడలో బతికున్న పాములను వేసుకుని నృత్యాలు చేస్తూ వీధుల్లో తిగుతారు. ఇది గోగాజీకి పాములతో ఉన్న సంబంధానికి ప్రతీక కాగా విషం నుంచి రక్షించే దివ్య శక్తికి నిదర్శనంగా భావిస్తారు.

రాజస్థానీ సంగీతం.. భక్తి గీతాలు.. ఊరేగింపులతో కూడిన ఈ నృత్యాలు.. శతాబ్దాల నాటి జానపద కథల్లోనూ ఉంటాయి. భక్తులు గోగాజీ ఆలయంలో పాలు, తినుబండారాలను నైవేద్యంగా సమర్పించి.. పాము ఆకారంలోని విగ్రహాలకు మొక్కుతారు. ఈ ఆచారాలు పాము కాటు నుంచి రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు. మేళాలో కాల్బేలియా నృత్యాలు, స్త్రీలు పాముల మాదిరిగా కదులుతున్నట్లు ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే ఈ పండుగకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

VIDEO

Next Story