- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వచ్చంధంగా భూమి ఇస్తావా.. కబ్జా చేయించాలా.. తహసీల్దార్ వీడియో వైరల్
‘స్వచ్ఛందంగా భూమి ఇస్తావా.. కబ్జా చేయించాలా’ అంటూ ఓ తహసిల్దార్ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్ తహసిల్దార్ రైతును భూమి కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీక్రెట్‌గా రికార్డ్

దిశ, వెబ్ డెస్క్ : ‘స్వచ్చంధంగా భూమి ఇస్తావా.. కబ్జా చేయించాలా’ అంటూ ఓ తహసిల్దార్ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్ తహసిల్దార్ రైతును భూమి కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీక్రెట్‌గా రికార్డ్ చేయబడిన ఈ క్లిపింగ్ వైరల్ కాగా అధికారి యూసుఫ్ నగర్ గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తిని భూమి వదులుకోమని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ మాఫియాకు సపోర్ట్‌గా ఈ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి మోసపూరిత, ఒత్తిడితో కూడిన ల్యాండ్ ట్రాన్స్‌ఫర్లు ఆత్మహత్యలకు, హింసకు దారితీస్తున్నాయని.. తహసిల్దార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఖచ్చితంగా హిట్లర్ ఫాలోవర్’, ‘కఠిన చట్టాలు అవసరం. అతను తన తండ్రి పోస్ట్‌లా చూస్తున్నాడు’, ‘ ఎవరు భూమి కబ్జా చేసే అదనపు పవర్స్ ఇచ్చారు? అతను ప్రభుత్వాన్ని డిఫేమ్ చేస్తున్నాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.






