- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిఫ్టులో ఇరుక్కున్న చిన్నారులను కాపాడిన బాలిక.. ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
లిఫ్టులో ఇరుకున్న ఇద్దరు చిన్నారులను ఓ బాలిక ఎంతో ధైర్యంగా రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: లిఫ్టులో ఇరుకున్న ఇద్దరు చిన్నారులను ఓ బాలిక ఎంతో ధైర్యంగా రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 4 మిలియన్ల వ్యూవ్స్ రాగా వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. వీడియోలో అపార్ట్‌మెంట్‌లోని కొందరు మహిళలు లిఫ్ట్ డోర్ వద్ద నిలుచుని మాట్లాడుతుండగా ఇద్దరు చిన్నారులు లిఫ్ట్‌లోకి వెళ్లిపోయారు. వెంటనే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది. అయితే పూర్తిగా క్లోజ్ అవ్వకముందే మహిళ తన చేతిని అడ్డుపెట్టి గట్టిగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది.
కానీ మహిళ అందులో పట్టకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న బాలిక లోపలికి దూరిపోయింది. ముందు ఒక చిన్నారిని బయట నిలుచున్న మహిళకు అప్పగించింది. తరవాత మరో చిన్నారిని సైతం అప్పగించి బయటకు వెళ్లిపోయింది. బాలిక చాకచక్యంగా ఇద్దరు చిన్నారులను కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ బాలిక ధైర్యానికి సెల్యూట్ కొడుతున్నారు. మరోవైపు లిఫ్ట్ వద్ద చిన్నారులను వదిలేసిన తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్టుల పనితీరుపైనా నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. లిఫ్టుులు సరిగ్గా పనిచేయడం లేదని, వాటివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.






