బాయ్ ఫ్రెండ్‌తో అన్నకు దొరికిపోయిన చెల్లి..అందరిముందే ఏం చేశాడంటే?

by Ajay Maddhiboyina |

ప్రియుడితో పిజ్జా కేఫ్‌కు వెళ్లిన యువతిపై ఆమె సోదరుడు అతడి స్నేహితులతో కలిసి దాడి చేశాడు.

బాయ్ ఫ్రెండ్‌తో అన్నకు దొరికిపోయిన చెల్లి..అందరిముందే ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో పిజ్జా కేఫ్‌కు వెళ్లిన యువతిపై ఆమె సోదరుడు అతడి స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ నెల 7వ తేదీన చోటు చేసుకుంది. ఓ పిజ్జా కేఫ్‌కు యువతి, ఆమె ప్రియుడు కలిసి వెళ్లారు. వారిద్దరితో పాటు యువతి స్నేహితురాలు కూడా వెళ్లగా ఆమె కొంతదూరంలో కూర్చుంది. కేఫ్ లో యువతి తన ప్రియుడితో కలిసి పక్కపక్కనే కూర్చుని ప్రేమగా మాట్లాడుతుండగా ఆమె సోదరుడు ఇనుప రాడ్డుతో లోపలికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన సోదరి పక్కన కూర్చుకున్న ప్రియుడిపై దాడి చేశాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కేఫ్ లో ఉన్నవారంతా గొడవను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఈ క్రమంలో యువతి సోదరుడి స్నేహితులు సైతం కేఫ్ లోకి వచ్చారు. యువతిని ఆమె సోదరుడు కొడుతుంటే, ఆమె ప్రియుడిని సోదరుడి స్నేహితులు కొట్టడం మొదలు పెట్టారు. చిరవకు యువతి ఏమీ చేయలేక అక్కడ నుండి బయటకు వెళ్లిపోగా, యువకుడిని మాత్రం చితకబాదారు. అతడి దుస్తులు చిరిగేలా దాడి చేశారు.

గాయాల పాలైనప్పటికీ వదిలిపెట్టకుండా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా ఘటన పూర్తిగా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఇండియాలో అమ్మాయి అతడి స్నేహితుడితో బయటకు వెళ్లినా తప్పే అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఆమె సోదరుడు చేసిన పనే సరైందని అంటున్నారు. video

Next Story