- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫీసుకి ఊబర్ బుక్ చేసుకున్న యువతి.. వచ్చిన డ్రైవర్‌ను చూసి షాక్.. నెట్టింట వైరల్!
ప్రస్తుతం నగరాల్లో చాలా మంది ర్యాపిడో, ఊబర్‌లలో కార్లు, బైకులు నడుపుతూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. కొందరు దీనిని పార్ట్ టైం చేస్తే మరికొందరు దీన్నే ఫుల్ టైంగా కూడా చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నగరాల్లో చాలా మంది ర్యాపిడో, ఊబర్‌లలో కార్లు, బైకులు నడుపుతూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. కొందరు దీనిని పార్ట్ టైం చేస్తే మరికొందరు దీన్నే ఫుల్ టైంగా కూడా చేస్తున్నారు. ఇక తాజాగా ఊబర్ బుక్ చేసుకున్న ఓ బెంగుళూరు యువతికి ఊహించని షాక్ తగిలింది. ప్రతిరోజూ ఆ యువతి ఊబర్ బుక్ చేసుకుని ఆఫీసుకు వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల బుక్ చేసుకోగా తమ ఆఫీసులోనే ఉద్యోగం చేసే టీమ్ లీడర్ రైడర్ గా వచ్చాడు.
దీంతో అతడిని చూసి యువత్ అవాక్కయ్యింది. మీరేంటి సార్ ఇలా వచ్చారు అని అడగ్గా టైం పాస్ కోసం ఊబర్ నడిపిస్తానని, ఇదొక సరదా అని అతడు చెప్పినట్టు తెలిపింది. దీనిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. తెగ వైరల్ అవుతోంది. ఇక యువతి ట్వీట్‌కు ఆసక్తికర రిప్లైలు వస్తున్నాయి. ఓ వ్యక్తి ఈ పోస్టుకు..నీకు ఉద్యోగం చేస్తూ ఊబర్ నడపాడికి కాళీ సమయం దొరుకుతుంది అంటే గ్రేట్ బ్రో అని కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ అమెరికాలో ఇలా చాలా మంది పార్ట్ టైం చేసుకుంటారని, ఇండియాలోనే సిగ్గుపడతారని పేర్కొన్నాడు.






