- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు..బ్యూటిఫుల్ వీడియో వైరల్
వినాయక చవితి ఉత్సవాలను భారత్‌లో ఎంతో గణంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా మన శత్రుదేశం పాకిస్థాన్‌లోనూ వినాయకచవితి వేడుకలు జరుపుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి ఉత్సవాలను భారత్‌లో ఎంతో గణంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా మన శత్రుదేశం పాకిస్థాన్‌లోనూ వినాయకచవితి వేడుకలు జరుపుకున్నారు. పాకిస్థాన్‌లోనూ హిందువులు ఉండగా వాళ్లు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భారత్‌లో మాదిరిగానే వాహనంలో గణేషుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఊరేగింపుగా వినాయకుడిని తీసుకువెళుతన్న సమయంలో ఆనందంతో స్టెప్పులు వేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సెలబ్రేషన్స్ పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోను వికాస్ ప్రోనమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోకు.. మైనారిటీగా ఉండటం మ్యాటర్ కాదని, ఇది యునిటీ గురించి అని పేర్కొన్నారు. మనమందరం కలిసి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటామని తెలిపారు. కాగా ఈ వీడియోకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. video






