- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి సంబురంలా అంత్యక్రియలు.. శ్మశానంలో కేక్ కట్టింగ్! (వీడియో)
పెళ్లి సంబురంలా అంత్యక్రియలు

దిశ, వెబ్‌డెస్క్: 80 ఏళ్లు నిండిన ఎవరైనా పిల్లలు సంతోషంగా ఉండాలి.. మనవళ్లు, మనవరాళ్ల పెళ్లిలు చూడాలనుకోవడం సహజం. వీటితోపాటే పిళ్లలంతా కలిసి మెలిసి ఉండాలి.. పొరపాటున తమకు ఏదైనా జరగరానిది జరిగితే.. సంబురంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉంటారు. అచ్చం ఇలాగే ఓ బామ్మ కూడా తన అంత్యక్రియలు ఘనంగా జరగాలని భావించింది. ఇదే విషయాన్ని పదే పదే పిల్లలకు చెబుతూ వచ్చింది. దీంతో బంధువులు అంతా కలిసి ఆమె అంత్యక్రియలను పెళ్లి సంబురంలా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా ఆథూర్‌కు చెందిన వెల్లయ్యమ్మల్(85) ఇటీవల తుదిశ్వాస విడిచింది. ఆమె చివరి కోరిక మేరకు 10 కేజీల కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి, బ్యాండు పెట్టి డాన్సులు వేస్తూ.. అంత్యక్రియలను పెళ్లి వేడుకలా నిర్వహించారు. మనుమలు-మనుమరాళ్లు అంతా కలిసి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో






