- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: కంటెంట్ కోసం ఇంత దారుణమా? ప్రజలను సూదితో గుచ్చిన ఫ్రెంచ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. చివరికి ఏమైందంటే..?
సోషల్ మీడియాలో లైక్, వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హద్దులు మీరి ప్రవర్తిస్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Social media) సోషల్ మీడియాలో లైక్, వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. కంటెంట్ కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధ పడతారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కూడా కొందరూ విచిత్రమై కంటెంట్‌తో వీడియోలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ అమీనె మోజిటో (Amine Mojito) అనే వ్యక్తి చేసిన పనికి అందరినీ షాక్‌కు గురిచేసింది.
తన వీడియోలు “మిగతా వారివి కంటే భిన్నంగా ఉండాలి” అనే ఆలోచనతో వీధుల్లోకి వెళ్లిన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్.. పార్క్, బస్టాప్, పాదచారులు, ఇలా కనిపించిన వ్యక్తులను సూదితో గుచ్చుతూ ఎస్కేప్ అవుతున్నాడు. బాధితుల్లో కొందరు తీవ్రంగా ప్రతిఘటించారు. సూది గుచ్చడంతో కొంత మంది ప్రజలు షాక్‌కు అయోమయానికి గురైయ్యారు. ప్రజల్లో అతను భయానక వాతావరణాన్ని గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ మేరకు విషయం పోలీసుల దృష్టికి చేరింది. అధికారులు అమీనె మోజిటోపై కేసు నమోదు చేశారు.
తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, అందజేసిన సాక్ష్యాలు, వీడియో ఆధారంగా కోర్టు అమీనెకు అక్టోబర్ 3 వ తేదిన ఆరు నెలల జైలు శిక్షతో పాటు 1,500 యూరోలు (సుమారు రూ.1.55 లక్షలు) జరిమానా విధించింది. కాగా, తను చేసింది ప్రాంక్ వీడియో అని, అది నకిలీ సిరంజీ అని కోర్టులో అతని తరఫు లాయర్ వాదనలు వినిపించారు. గతంలోనూ అమీనె మోజిటో అనేక వీడియోలు వివాదస్పదానికి దారి తీశాయి. కంటెంట్ కోసం మరీ ఇంత దారుణమా? సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం నైతికతను పక్కనపెట్టిన ఇలాంటి చర్యలకు పాల్పడటంపై నెటిజన్‌లు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైరల్ వీడయో ఇదే..






