5,900 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ సాహసం.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

సాధార‌ణంగా ఫుట్ బాల్ మ్యాచ్ అంటే నేల‌పై ఆడ‌తారు. రెండు జ‌ట్లు క‌లిసి పెద్ద గ్రౌండ్ లో ఈ ఆట‌ను ఆడ‌తారు. కానీ గాలిలో ఫుట్ బాల్ ఆడ‌టం ఎప్పుడైనా చూశారా..? ఆ ఆలోచ‌న కూడా రాదు క‌దా.

5,900 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ సాహసం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సాధార‌ణంగా ఫుట్ బాల్ మ్యాచ్ అంటే నేల‌పై ఆడ‌తారు. రెండు జ‌ట్లు క‌లిసి పెద్ద గ్రౌండ్ లో ఈ ఆట‌ను ఆడ‌తారు. కానీ గాలిలో ఫుట్ బాల్ ఆడ‌టం ఎప్పుడైనా చూశారా..? ఆ ఆలోచ‌న కూడా రాదు క‌దా. కానీ ర‌ష్య‌న్ అథ్లెట్ సెర్గీ బోయ్ ట్సోవ్ హాట్ ఎయిర్ బెలూన్ పై ఫుట్ బాల్ మ్యాచ్ ఆడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పర్చాడు. ఎయిర్ బెలూన్ పై చిన్నపాటి గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేసి ఈ మ్యాచ్ ఆడారు. మొత్తం న‌లుగురు వ్య‌క్తులు ఈ మ్యాచ్ ఆడ‌గా ఇద్ద‌రు నెట్ వద్ద ఉంటే మ‌రో ఇద్ద‌రు మ‌ధ్య‌లో నిలుచున్నారు.

5,900 అడుగుల ఎత్తులో ఆడిన ఈ మ్యాచ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఆ మినీ గ్రౌండ్ చుట్టూ ఎలాంటి ర‌క్ష‌ణ లేదు. బాల్ ని తన్నితే చూసుకుని ఆ మినీ గ్రౌండ్లో ప‌డేలానే త‌న్నాలి. కాబ‌ట్టి చాలా టెక్నిక‌ల్‌గా ఈ ఆటను ఆడారు. అంతే కాకుండా ఆటగాళ్లు కింద పడినా అంత ఎత్తు నుండి పడితే కిందపడేలోపు ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందే. వారి చూట్టూ ఓ విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆడుతున్న వాళ్లు ఎంతో కుషీగా ఉన్నారు కానీ వీడియో చూస్తున్నవారికి మాత్రం భయంవేసేలా ఉంది. video

Next Story