- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ కోళ్లకు ఉన్న దేశభక్తి.. మనుషులకు కూడా లేదు!
ఐదు కోళ్లు... మధ్యలో జాతీయ జెండాను పెట్టుకొని... జెండాను ఆవిష్కరించాయి

దిశ, వెబ్ డెస్క్: ఇండిపెండెన్స్ డే... నిన్న దేశవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మొట్టమొదటగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఎగురవేశారు. అనంతరం.. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరూ.. జెండా ఎగురవేశారు. ఈ 79 వ ఇండిపెండెన్స్ డేను కొంతమంది భారతీయులు విదేశాల్లో కూడా నిర్వహించారు.
అయితే ఈ సందర్భంగా జెండా ఎగరవేసేటప్పుడు.. కొంతమంది రాజకీయ నాయకులు తప్పిదాలు చేశారు. మరికొంతమంది అయితే తమకు సంబంధం లేదన్నట్లుగానే... జెండా ఆవిష్కరణలో పాల్గొనలేదు. ఇలాంటి నేపథ్యంలో కోళ్లు చేసిన పని అందరిని ఆకట్టుకుంటోంది. ఐదు కోళ్లు ఏకమై.. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నట్లు ఒక వీడియో వైరల్ గా మారింది.
ఐదు కోళ్లు... మధ్యలో జాతీయ జెండాను పెట్టుకొని... జెండాను ఆవిష్కరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కోళ్లకు ఉన్న బుద్ధి జనాలకు లేదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే అది AI ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని కొంతమంది కౌంటర్ ఇస్తున్నారు.






