- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral news: పైసా పైసా పదేళ్లు కూడబెట్టి కొన్న ఫేరారీ.. గంటలోనే కాలి బూడిదైన కారు
సొంత ఇల్లు, సొంత కారు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: సొంత ఇల్లు, సొంత కారు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అందుకోసం పైసా పైసా డబ్బులు కూడబెట్టుకుంటారు. చివరికి ఆ కలను సాకారం చేసుకోసుకుని సంబరపడిపోతారు. ఆ రోజును లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఎంతో కష్టపడి ఇష్టంగా కొన్న కారు.. డెలివరీ తీసుకున్న గంటలోనే కాలి బూడిదైతే ఆ బాధ వర్ణణాతీతం. కానీ, తాజాగా జపాన్‌లో (Japan) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
జపాన్‌లోని టోక్యోలో( Tokyo ) హాంకాన్( Honkon ) అనే 33 ఏళ్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ తన డ్రీమ్ కారు కొనుకునేందుకు దాదాపు పదేళ్లుగా డబ్బులు సేవ్ చేశాడు. ఏప్రిల్ 16న 43 మిలియన్ యెన్ (దాదాపు రూ.2.6 కోట్లు) వెచ్చించి లగ్జరీ కారు ఫెరారీ 458 స్పైడర్‌ను (Ferrari 458 Spider) కొనుగోలు చేశాడు. ఇక ఎన్నో ఏళ్ల తన డ్రీమ్ నేరవేరటంతో ఆ బ్రాండ్ న్యూ కారును తీసుకుని మినాటో ఏరియాలో షుటో ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించాడు. ఇంతలో హాంకాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ కారు ఇంజిన్ నుంచి పొగలు రావటం గమనించాడు. వెంటనే కారును పక్కకు ఆపి బయటకు దిగాడు. క్షణాల్లో కారు మంటల్లో చిక్కుకుని చూస్తుండగానే కాలిపోయింది.
ఈ ఘటనతో హాంకాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన బాధను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. 'జపాన్‌లో ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తిని బహుశా నేనేనేమో' అని వాపోయాడు. కారుకు ఇన్సూరెన్స్ ఉందా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. అలాగే, కారులో మంటలకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
ఇక ఈ ప్రమాదంపై టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. కాగా, 2010లో ఫెరారీ 458 ఇటాలియా మోడల్‌లలో ఫైర్ హజార్డ్ సమస్య కారణంగా 1,200 కార్లను రీకాల్ చేసిన సంగతి గమనార్హం. అయితే ఈ కారు ఆ తర్వాత తయారైన స్పైడర్ మోడల్.
社長がフェラーリ買ったらしいから乗せてもらった1時間後に燃えた pic.twitter.com/kZq4QYgwkZ
— ポケカメン@ちょこらび (@GC5R5OGIKgV0yvz) April 16, 2025






