- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : పక్కన నేనుండగానే అమ్మాయిని టచ్ చేస్తావా..? జుట్టు పట్టుకొని పొట్టు పొట్టుగా ఎలా కొట్టిందో చూడండి..!!
Viral video : పక్కన నేనుండగానే అమ్మాయిని టచ్ చేస్తావా..? జుట్టు పట్టుకొని పొట్టు పొట్టుగా ఎలా కొట్టిందో చూడండి..!!

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ చోటు చేసుకునే కొన్ని సంఘటనలు, అనుకోకుండా కంట పడే సన్నివేశాలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని కోపం తెప్పిస్తుంటాయి. ఇక ఫన్నీ వీడియోలకుండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనుషులకు సంబంధించినవైనా, యానిమల్ రిటేటెడ్ అయినా చూడగానే ఆకట్టుకునే కంటెంట్ ఉంటే చాలు.. తక్షణమే సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ సన్నివేశంతో కూడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ‘Female solutions are the universal bro’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. మిగతా వారు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బహుశా అది భారత దేశంలోని ప్రాంతమైతే కాదు, కానీ ఏదో విదేశాల్లోని జూపార్క్‌లా అనిపిస్తోంది. కాగా ఇక్కడ పచ్చని గరికతో కూడిన ఒక ప్రదేశంలో ఒక మగ గొరిల్లా(Gorilla), ఒక ఆడగొరిల్లా కలిసి సరదాగా ఆడుకుంటున్నాయి. మెత్తనైన పచ్చటి గడ్డి ప్రాంతంలో పైనుంచి కిందకు జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. అయితే ఈ పార్కును చూడ్డానికి వచ్చిందేమో బహుశా.. ఒక అమ్మాయి అక్కడికి వచ్చి మగ గొరిల్లా వైపు కాస్త ముందుకు వంగి ఏదో చెప్పబోతుండగా.. తక్షణమే ఆ మగ గొరిల్లా ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని లాగుతుంది. అయితే దాని వెనుక వైపు కాస్త దూరంగా ఆడుకుంటున్న ఆడగొరిల్లా ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే దగ్గరకు వస్తుంది. అమ్మాయి జుట్టు పట్టుకొని లాగిన మగ గొరిల్లాపై కోపం ప్రదర్శిస్తూ.. ‘నేనుండగా మరో అమ్మాయిని టచ్ చేస్తావా?’ అనే విధంగా హావ భావాలు ప్రదర్శిస్తూ మగ గొరిల్లా(Male gorilla) జుట్టు పట్టుకొని లాగుతూ కొడుతుంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral video) అవుతుండగా.. ‘లేడీస్ చేతిలో తన్నులు తినడం మానవులకే పరిమితం కాదు అయితే.. జంతువులు కూడా అంతేనమో..’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి! Video Link






