- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో ట్రాక్ పై కొడుకుతో ఉచ్చ పోయించిన తండ్రి.. సివిక్ సెన్స్ లేదని దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్
ఇండియన్స్ కి సివిక్ సెన్స్ లేదని విదేశీయులు ఎప్పుడైనా అంటే చాలా హార్ట్ అయిపోతుంటాం.

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్స్ కి సివిక్ సెన్స్ లేదని విదేశీయులు ఎప్పుడైనా అంటే చాలా హార్ట్ అయిపోతుంటాం. కాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన చూస్తే తప్పకుండా సిగ్గుతో తలదించుకుంటాం. దేశరాజధాని ఢిల్లీలోని ఇంద్రలోక్ అనే మెట్రోస్టేషన్లో తల్లీదండ్రి వారి నాలుగేళ్ళ కుమారుడితో వచ్చారు. మెట్రోరైలు రావడానికి మరో ఐదు నిముషాలు ఉండటంతో అక్కడే ఓ బెంచి మీద కూర్చున్నారు. ఇంతలో వారి నాలుగేళ్ళ కుమారుడు యూరిన్ వస్తుందని చెప్పగా.. ఆ తండ్రి అక్కడే ఉన్న మెట్రో ట్రాక్ మీదనే ఆ చిన్నారితో యూరిన్ పాస్ చేయించాడు.
దీంతో ఒళ్ళు మండిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్లో పెట్టడంతో.. ఆ పేరెంట్స్ [పై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇండియన్స్ కి సివిక్ సెన్స్, కామన్ సెన్స్ లేదని, అవకాశం ఉంటే విమానంలో నుంచి కూడా ఇదే పని చేయిస్తారని, పిల్లాడికి సంస్కారం నేర్పించాలి కానీ ముందు ఆ తలిదండ్రులకు నేర్పించాలి అని మండిపడుతున్నారు. అయితే వీరిని వెనకేసుకొస్తున్న వారు కూడా లేకపోలేదు.
చిన్నబాబు మూత్రాన్ని ఆపుకోలేడు కదా మరి అని ఒకరంటే, మెట్రో స్టేషన్ పై అంతస్తులో కూడా వాష్ రూమ్స్ అందుబాటులో ఉంచని మెట్రో సంస్థదే తప్పని మరికొందరు అన్నారు. రోడ్డు పక్కన, ఖాళీ స్థలాల్లోనే కాదు, మెట్రో స్టేషన్ ట్రాకులను కూడా వదలమని మరోసారి రుజువు చేసాడు ఆ తండ్రి. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.






