- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: టీచర్ నా కొడుకు హోం వర్క్ రాయలేకపోతున్నా క్షమించండి...విద్యార్థి తండ్రి రిక్వెస్ట్
సమ్మర్ హాలిడేస్ పూర్తవ్వడంతో తిరిగి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు అంతా మళ్లీ పాఠశాల బాట పట్టారు.

దిశ, వెబ్ డెస్క్: సమ్మర్ హాలిడేస్ పూర్తవ్వడంతో తిరిగి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు అంతా మళ్లీ పాఠశాల బాట పట్టారు. అయితే సెలవుల్లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయలేదని ఓ తండ్రి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లలకు ఇచ్చే హోం వర్క్స్, ప్రాజెక్టులు దాదాపు తల్లి దండ్రులే పూర్తి చేస్తుంటారు. ఎందుకంటే అవి పిల్లలు చేయలేని విధంగా, వారి సామర్థ్యానికి మించి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి టీచర్ ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తన కుమారుడిని పక్కన కూర్చోబెట్టుకుని.. మేడమ్ జీ సెలవుల్లో మీరు ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయలేదు. నేను ఆ వర్క్ చేయలేదని ప్రతిరోజు నా కొడుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను పూర్తి చేయలేకపోతున్నా..దయచేసి అతని మర్కులు తగ్గించవద్దు. అంటూ భావోద్వేగానికి గురైనట్టు నటిస్తూ ఫన్నీగా క్షమాపణలు చెప్పాడు. వీడియోలో అతడి పక్కనే కూర్చున్న కుమారుడు నవ్వు ఆపుకుంటున్నాడు. రిషి పంటిట్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. స్కూల్స్ ప్రారంభం అవుతుండటంతో ఇది ఇప్పటి తల్లి దండ్రుల పరిస్థితి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






