- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ప్రేమ విషయం చెప్పిన కూతురు.. తండ్రి చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు
సాధారణంగా ఇండియాలో కుమారులు ప్రేమ వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు అంగీకరిస్తారు కానీ కూతుళ్లు ప్రేమ పేరు ఎత్తినా సహించలేరు.

దిశ,వెబ్ డెస్క్: సాధారణంగా ఇండియాలో కుమారులు ప్రేమ వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు అంగీకరిస్తారు కానీ కూతుళ్లు ప్రేమ పేరు ఎత్తినా సహించలేరు. అందులోనూ వేరే కులం వాడిని ప్రేమించడం, పెళ్లి చేసుకుంటామని చెప్పడం లాంటివి చేస్తే అస్సలు ఊరుకోరు. కానీ ఓ తండ్రికి తన కూతురు ప్రేమ విషయం చెప్పిన వెంటనే అతడు స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో కూతురు.. తాను 11ఏళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని భయంతో తండ్రిని హత్తుకుని చెప్పింది. కూతురు ఏడుస్తూ చెప్పగా తండ్రి అడ్డుచెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
నీకు ఇష్టమైతే నా ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ప్రేమ అనేది సాధారణం అని అందరికీ పుడుతుందని చెప్పాడు. ఇది సంతోషించాల్సిన విషయం అని ఎందుకు ఏడుస్తున్నావని.. సంతోషంగా చెప్పాలని అన్నాడు. భవిష్యత్ లో కలిసి ఉండేది మీరు మేం చేసేది ఏం లేదు అన్నారు. అబ్బాయి మంచివాడు అయితే చాలని మిగితావి తనకు అవసరంలేదని చెప్పాడు. కులం, డబ్బు కంటే మంచితనమే ముఖ్యమని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కులం, డబ్బు గురించి అడగకుండా తండ్రి పెళ్లికి ఓకే చెప్పడంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి అమ్మాయి తండ్రి ఇలా ఆలోచిస్తే సంతోషంగా ఉంటారని కామెంట్ చేస్తున్నారు. VIDEO






