స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన అభిమాని

by Muthe.Rajitha |

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కు రూ.10 వేల కోట్లు ఇచ్చాడు ఓ గుర్తు తెలియని అభిమాని.

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన అభిమాని
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కు రూ.10 వేల కోట్లు ఇచ్చాడు ఓ గుర్తు తెలియని అభిమాని. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్‌మార్‌ గురించి తెలియని వారుండరు. ప్రపంచ అత్యుత్తమ గోల్ కీపర్స్ లో ఒకరు నెయ్‌మార్‌. అయితే ఇటీవల ఓ గుర్తు తెలియని బిలియనీర్ అభిమాని తన మొత్తం ఆస్తిని నెయ్‌మార్‌ పేరున వీలునామా రాసిన విషయం వార్తల్లో సంచలనం సృష్టించింది.

అయితే ఆ అభిమాని తనకు చెందిన మొత్తం ఆస్తి రూ.10 వేల కోట్లను తన తర్వాత నెయ్‌మార్‌కు అందేలా వీలునామా రాశాడు. ఇటీవల అతను మరణించడంతో సదరు వీలునామా సంగతి బయటికి వచ్చింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని నెయ్‌మార్‌ టీం పేర్కొంది.

Next Story