ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే పాపను వదిలేశారు! డాక్టర్ వీడియో వైరల్.. తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |   (  Updated:2025-04-28 08:39:09  IST  )

గతంలో కొడుకు పట్టలేదని భార్యకు విడాకులు, చంపడం, రెండో పెళ్లి చేసుకోవడం, పురిట్లోనే బిడ్డను చంపడం, చెత్తకుప్పలో పడేయడం వంటి ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.

ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే పాపను వదిలేశారు! డాక్టర్ వీడియో వైరల్.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video) గతంలో కొడుకు పట్టలేదని భార్యకు విడాకులు, చంపడం, రెండో పెళ్లి చేసుకోవడం, పురిట్లోనే బిడ్డను చంపడం, చెత్తకుప్పలో పడేయడం వంటి ఘటనలు ఎన్నో చూసి ఉంటారు. ఇప్పటి కూడా ఆడపిల్ల (baby girl) పుడుతుంది అని చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆడపిల్ల పుట్టిందని ఓ ఫ్యామిలీ చేసిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం హాస్పిటల్లోనే పాపను వదిలేసి పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ లేడీ డాక్టర్ పాపను చూపిస్తూ ఓ వీడియో చేశారు. వీడియోలో లేడీ డాక్టర్ మాట్లాడుతూ.. ఒక రోజు ముందే తమ హస్పిటల్లో ఒక ఆడపిల్ల పుట్టిందని, తన అమ్మకు పాప మూడో కూతురు కావడంతో ఆ ఫ్యామిలీ చాలా దిగులుతో ఉన్నారని చెప్పారు. తనను (baby girl in hospital) హాస్పిటల్లోనే వదిలేయాలని ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందని, కనీసం పాప తండ్రి ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చారు. ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశానికి ప్రెసిడెంట్ ఒక మహిళ అని, దేశం గర్వించదగ్గ మహిళ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ భారత మహిళ అని మహిళల గొప్పతనం గురించి వివరించారు. 21 శతాబ్దంలో కూడా ఆడపిల్ల పుట్టిందని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె వీడియో చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత ముద్దుగా ఉన్న పాపను ఎలా వదిలి వెళ్లిపోవాలని అనిపించిందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆ చంటి పాపను మేము ఆ పాపను దత్తత తీసుకొని పెంచుకుంటామని చాలామంది కామెంట్స్ చేశారు.

ఇక వీడియో వైరల్ కావడంతో పాప తండ్రి, ఫ్యామిలీ తాము చేసిన తప్పు తెలుసుకున్నారు. ఈ మేరకు లేడీ డాక్టర్ మరో వీడియో విడుదల చేశారు. పాపను ఇంటికి తీసుకెళ్లడానికి రెడీగా ఉందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుందని వివరించారు. ఈ సందర్భంగా నెటిజన్లకు లేడీ డాక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికైన ఆడపిల్ల పుట్టిందని వదిలివేయకుండా ఇలాంటి వారు మారాలని నెటిజన్లు కోరుతున్నారు. కాగా, ఆ పాప ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.


Click For Tweet..

Next Story