- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. షాక్‌కు గురైన బ్యాంకు సిబ్బంది
by Kema Shiva Kumar |
నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని (Varni) మండలంలోని కెనరా బ్యాంకు (Canara Bank)లో సంచలనం చోటచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని (Varni) మండలంలోని కెనరా బ్యాంకు (Canara Bank)లో సంచలనం చోటచేసుకుంది. ఇవాళ ఉదయం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పంట రుణం తిరిగి చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అతడు తీసుకెళ్లిన నగదులో సుమారు రూ.45 వేల విలువ చేసే నకిలీ నోట్లు ఉన్నట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, రైతు ఆ నోట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఇచ్చారనే విషయాపై స్పష్టత రాలేదు. కాగా, ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో నకిలీ నోట్లు చలామణి అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా రైతులు, చిరు వ్యాపారులు నకిలీ నోట్ల బారిన పడుతున్నారు. ప్రజలు నోట్లను జాగ్రత్తగా పరిశీలించి, అనుమానం వస్తే బ్యాంకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






