"ఎడ్జ్ ఆఫ్ ది ఎర్త్" ఎంత అబ్బురంగా ఉందని సంబరపడుతున్నారా ? అసలు విషయం తెలిస్తే షాకవుతారు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-26 05:22:58  IST  )

వృత్తాకారంలో ఉండే భూమికి మొదలు చివర అనేది ఉంటుందా ? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? ఇటీవల భూమి చివరను కనుగొన్నామంటూ..

ఎడ్జ్ ఆఫ్ ది ఎర్త్ ఎంత అబ్బురంగా ఉందని సంబరపడుతున్నారా ? అసలు విషయం తెలిస్తే షాకవుతారు
X

దిశ, వెబ్ డెస్క్: వృత్తాకారంలో ఉండే భూమికి మొదలు చివర అనేది ఉంటుందా ? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? ఇటీవల భూమి చివరను కనుగొన్నామంటూ కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఎడ్జ్ ఆఫ్ ది ఎర్త్" (Edge of the Earth) అంటార్కిటికాలో ఉందని చెప్తున్నారు. నిజంగా ఆ వీడియో చూడటానికి చాలా బాగుంది. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పి, పక్కనే జలపాతం కూడా కనిపిస్తోంది. కానీ ఇది నిజమైనా వీడియోనేనా అంటే.. కాదంటున్నారు నిపుణులు. చుట్టూ మంచు ఉన్న ప్రాంతంలో జలపాతం ఎలా వచ్చింది? వృత్తాకారంలో ఉండే భూమికి చివర ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. ఏఐ వచ్చాక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారిందని చెప్తున్నారు.

"ఎడ్జ్ ఆఫ్ ది ఎర్త్" వీడియో కూడా ఏఐ జెనరేటెడ్ వీడియోనే అని పలు టెక్ నిపుణులు తెలిపారు. ఒక వ్యక్తి కెమెరాతో మాట్లాడుతున్నపుడు అతని వెనుక జాలువారే జలపాతాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇది ఏఐ జెనరేటెడ్ వీడియో అని తెలుస్తుందని సూచించారు. ఆ వీడియోలో ఎంటైర్ సిటీ ఐస్ కింద ఉందని మరొకరు చెప్తారు. ఇదెలా సాధ్యం. అలా ఉంటే.. ప్రజలు ఎలా బ్రతికి ఉంటారు ? ఎర్త్ కి ఎడ్జ్ అయితే రీసెర్చర్ ఎలా క్లైంబ్ చేయగలిగాడు.? గురుత్వాకర్షణ శక్తి భూమిపై మాత్రమే కదా ఉంటుంది. మరి అతను "ఎడ్జ్ ఆఫ్ ది ఎర్త్" నుంచి కిందికి ఎలా వెళ్లగలిగాడు.? అంతా శూన్యమే ఉంటే గాల్లో తేలియాడాలి కదా. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ను గమనిస్తే అది ఏఐ జెనరేటెడ్ వీడియో అని స్పష్టమవుతోంది.


Next Story