అధర్మం బలంగా ఉన్నా అది తాత్కాలికం.. జన్మాష్టమి వేళ YS జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-16 06:01:24  IST  )

దేశ వ్యాప్తంగా ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు.

అధర్మం బలంగా ఉన్నా అది తాత్కాలికం.. జన్మాష్టమి వేళ YS జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పెషల్ విషెస్ చెప్పారు.

‘అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం అందుకు నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవలే పులివెందుల (Pulivedula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయాయి. చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యబద్ధంగా జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిపించలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. రిగ్గింగ్‌కు పాల్పడి టీడీపీ (TDP) నేతలు విజయం సాధించారని, రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైఎస్ జగన్ కామెంట్ చేశారు. అయితే, నేడు జన్మాష్టమి వేళ ఆయన కూటమి సర్కార్‌ను టార్గెట్‌‌గా చేసుకుని ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Next Story