మహారాష్ట్రలో ‘ఎప్‌స్టిన్‌ ఫైల్స్’ తరహా ఉదంతం.. జ్యోతిష్యం ముసుగులో కామకాండ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 12:22:47  IST  )

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టిన్ ఫైల్స్’ తరహా కేసు సంచలనం సృష్టిస్తోంది. నాశిక్‌లో ఓ ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్యం పేరుతో వందలాది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టిన్‌ ఫైల్స్’ తరహా ఉదంతం.. జ్యోతిష్యం ముసుగులో కామకాండ
X

దిశ వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాశిక్‌ (Nashik)లో మరో ఎప్‌స్టిన్ ఫైల్స్ (Epstein Files) తరహా ఉదంతం బయటపడింది. ప్రముఖ జ్యోతిష్యుడు, కెప్టెన్‌గా పిలవబడే అశోక్ ఖరాత్ (67) దారుణాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఓ 35 ఏళ్ల మహిళపై వరుసగా లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో నాశిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం అమెరికా నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టిన్ కేసును తలపిస్తుండటంతో అతడిని ‘మహారాష్ట్ర ఎప్‌స్టిన్’గా అభివర్ణిస్తున్నారు.

అశ్లీల వీడియోల కలకలం..

పోలీసుల విచారణలో అత్యంత భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. నిందితుడి కార్యాలయం, నివాసంపై దాడి చేసిన పోలీసులు రహస్యంగా ఎవరిక కంట పడకుండా దాచిన ఓ పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు మహిళలకు సంబంధించి 58 అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, దొరికిన ఆ వీడియోల్లో పలువురు ప్రముఖ మహిళలు, సెలబ్రిటీలు (Celebrities) ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. జ్యోతిష్యం పేరుతో వారిని లొంగదీసుకుని, రహస్య కెమెరాల ద్వారా ఈ వీడియోలను చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన ‘ఓకస్ ప్రాపర్టీ డీలర్’ కార్యాలయంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి బాధితులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇతడు ఈ వీడియోలను వాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోల్లో ఉన్న మహిళలు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడానికి వెనుకాడతారని భావించిన పోలీసులు, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు.

రాజకీయ సంబంధాలు..

అశోక్ ఖరాత్ కేవలం జ్యోతిష్యుడిగానే కాకుండా, రాజకీయ నేతలకు మార్గదర్శకుడిగా చలామణి అయ్యాడు. పలువురు మంత్రులు, కీలక నేతలకు జ్యోతిష్యం చెబుతూ వారితో సంబంధాలు కొనసాగించాడు. ఇటీవలే కొందరు మహిళా నేతలు ఇతడి పాదపూజ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియా (Social Media)లోనూ వైరల్ అవ్వడంతో ఈ కేసు రాజకీయంగానూ వేడెక్కింది. ఈ మేరకు అశోక్ ఖరాత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నాశిక్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడికి 6 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ కుంభకోణం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యాపించి ఉండవచ్చని, విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Next Story