మంగళసూత్రం కోసం గోల్డ్ షాపుకు వృద్ధ దంప‌తులు..య‌జ‌మాని చేసిన ప‌నికి అంతా షాక్

by Ajay Maddhiboyina |

ప్ర‌స్తుతం భార్య భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధం అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తెగిపోతుందో అర్థం కావ‌డంలేదు.

మంగళసూత్రం కోసం గోల్డ్ షాపుకు వృద్ధ దంప‌తులు..య‌జ‌మాని చేసిన ప‌నికి అంతా షాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం భార్య భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధం అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తెగిపోతుందో అర్థం కావ‌డంలేదు. కానీ ఒక్క‌ప్పుడు పెళ్లి చేసుకున్న‌వాళ్లు మాత్రం క‌ష్టం చ‌వ్చినా సుఖం వ‌చ్చినా పెళ్లి చేసుకున్న‌వారితోనే ఉంటారు. వాళ్ల కోరిక‌లు తీర్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డతారు. అందుకు తాజాగా వైర‌ల్ అవుతున్న ఓ వీడియోనే నిద‌ర్శ‌నం. మ‌హారాష్ట్రలో ఓ వృద్ధుడు త‌న భార్య‌కు మంగ‌ళ‌సూత్రం కొనిచ్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు తీసుకుని బంగారం షాప్ కు వెళ్ల‌గా అక్క‌డ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌ల్నా జిల్లాలోని అంభోరా జ‌హంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే 93, శాంతా బాయి 85 భార్య భ‌ర్త‌లు.

వీరిద్ద‌రికీ 70ఏళ్ల క్రిత‌మే వివాహం జ‌రిగింది. అయితే భార్య కోరిక‌మేర‌కు షిండే మంగ‌ళ‌సూత్రం కొనివ్వ‌డానికి షాపుకు తీసుకువ‌చ్చారు. వాళ్లిద్ద‌రూ లోప‌లికి వ‌స్తుంటే ఆ న‌గ‌ల దుకాణంలోని వారంతా డ‌బ్బులు అడిగేందుకు లోప‌లికి వ‌స్తున్నారేమో అనుకున్నారు. కానీ వాళ్లు వ‌చ్చిన త‌ర‌వాత దాచుకున్న సొమ్మంతా చూపించి మంగ‌ళ‌సూత్రం కావాల‌ని అడిగారు. అది చూసిన షాపు భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ వ‌యసులో భార్య కోసం ఆమె భ‌ర్త చూపిస్తున్న ప్రేమ చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. దీంతో డ‌బ్బులు వ‌ద్ద‌ని కేవ‌లం రూ.20 తీసుకుని వాళ్లకు మంగ‌ళ‌సూత్రం అంద‌జేశారు. ఆ దంప‌తులు య‌జ‌మానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఎంతో సంతోష‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Next Story