- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాదికి రూ.60 లక్షలు సంపాదన.. భారత్‌లో జీవించటం కష్టమేనా? నెట్టింట తీవ్ర చర్చ
చదువు అయిపోయాక ఆరు అంకెల జీతంతో ఉద్యోగం పొందాలని సగటు భారతీయుడు కోరుకుంటుంటాడు.

దిశ, వెబ్ డెస్క్: చదువు అయిపోయాక ఆరు అంకెల జీతంతో ఉద్యోగం పొందాలని సగటు భారతీయుడు కోరుకుంటుంటాడు. ఇక ఆరు అంకెల జీతం అంటే వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాంటిది ఏడాదికి రూ.60 లక్షల సంపాదన ఉంటే లైఫ్ సెట్టు అనుకుంటారు. కానీ, ఏడాదికి రూ.60 లక్షల సంపాదించినప్పటికీ భారత్‌లో విలువైనా జీవితాన్ని పొందలేమట. తాజాగా ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.
బెంగళూరుకు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి రెడ్డిట్ వేదికగా తన ఆవేదన పంచుకుంటూ ఓ పోస్టు పెట్టాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారి నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వ్యక్తి బెంగళూరులోని హోరమావు ప్రాంతంలో తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.60 లక్షలుగా ఉంది. కానీ, తాను విలువైనా జీవితాన్ని పొందలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు.
భారత్‌లో మన ఆదాయంలో 30-40% వరకూ పన్నులు కడుతాము.. కానీ అందుకు ప్రతిఫలంగా ఏం పొందుతున్నామని ప్రశ్నించాడు. కెనడా, జర్మనీ వంటి అధిక పన్నులు విధించే దేశాల్లో ప్రజలు ఉచిత విద్య, వైద్యం పొందుతున్నారు. అలాగే, మెరుగైనా మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నారు. కానీ, భారత్‌లో విద్య, ఆరోగ్యంలాంటి ప్రాథమిక సదుపాయాలకే ప్రైవేట్‌పై ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటికే ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటోంది. మరి ఈ పన్నులన్నీ ఎటు వెళ్తున్నాయంటూ అతడు ప్రశ్నించాడు.
అంతేకాదు, తన ఇంటి నుంచి ఆఫీసుకి కేవలం 3కిలో మీటర్ల దూరం ఉంటుందని, కానీ వెళ్లేందుకు 40 నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్లన్నీ తవ్విపారేసినట్టే ఉంటాయని, ఎప్పుడో మొదలైన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదని, రోడ్డు పన్నుల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానం, కానీ ప్రతిఫలంగా గతుకుల రోడ్లే ప్రజలకు మిగిలాయంటూ అతను వాపోయాడు. శబ్ద కాలుష్యం, ట్రాఫిక్, రోడ్ రేజి... ఇవన్నీ రోజువారీ అనుభవాలు కావడం బాధాకరమని పేర్కొన్నాడు.
అంతేకాదు, ఒక సాధారణ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ.2000 లంచం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. ఇంటి అద్దె పెరిగింది, స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయని జీవన వ్యయాలపై నిరాశను వ్యక్తం చేశాడు. తనకు ఇండియాలోనే ఉండాలని ఉందని, కానీ సిస్టమ్‌తో విసిగిపోయినట్లు చెప్పాడు. చివరగా కేవలం తనకు మంచి రోడ్లు కావాలని, ప్రభుత్వ సేవలలో పారదర్శకత ఉండాలని, తమ పన్నులకు న్యాయమైన ప్రతిఫలం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక్కడే ఉండే బదులు విదేశాలకు వెళ్లటం బెస్ట్ ఆప్షన్ అంటూ పలువురు అతడి సలహాలు ఇస్తున్నారు. కాగా, ఇలాంటి అభిప్రాయాలు నిత్యం చాలా మంది మధ్య తరగతి కుటుంబాల్లో వినిపిస్తుంటాయి.
by inindia






