- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: అలాంటి పరిస్థితిలో భార్యను ఎత్తుకొని పరుగెత్తే పోటీలు.. గెలిస్తే ఏం ఇస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Viral: అలాంటి పరిస్థితిలో భార్యను ఎత్తుకొని పరుగెత్తే పోటీలు.. గెలిస్తే ఏం ఇస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

దిశ, ఫీచర్స్ : కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్ వంటి ఆటల పోటీల గురించి అందరికీ తెలిసిందే. కానీ.. భార్యలను భుజాలపై ఎత్తుకొని పరుగెత్తే భర్తల పరుగుపందెం గురించి ఎప్పుడైనా విన్నారా? ఫిన్లాండ్‌లో ప్రతీ సంవత్సరం నిర్వహించుకునే ముఖ్యమైన సాంస్కృతిక క్రీడా పోటీలుగా ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 2025 జులైలో కూడా జరుగనున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భార్యలను మోసే పోటీలు(Wife-Carrying Race) సాధారణంగా ఫిన్‌లాండ్‌లోని సోంకజార్వి పట్టణంలోనే జరుగుతుంటాయి. ఒక ప్రత్యేకమైన వినోదాత్మక సంప్రదాయంలో భాగంగా ఇవి కొనసాగుతాయి. కేవలం ఇక్కడి జంటలు మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్న దేశ విదేశాల నుంచి వచ్చిన జంటలు కూడా పాల్గొనవచ్చు. అయితే క్రీడా నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనే జంటల్లో భార్య వయసు 17 సంవత్సరాలకంటే ఎక్కువ ఉండి, కనీసం 49 కిలోల బరువు ఉండాలి. ఒకవేళ భార్య తక్కువ బరువు ఉంటే, ఆమెను భర్త మోసేటప్పుడు 49 కిలోలకు బరువు చేరేలా పట్టుకోవడానికి ఏదైనా ఒక బ్యాగును ఇస్తారు.
వైఫ్ క్యారీయింగ్ రేస్‌లో భాగంగా పురుషులు తమ భార్యలను భుజంపై లేదా వీపుపై మోసుకుంటూ బరుద, నీరు, చిత్తడి నేల వంటి అడ్డంకులతో కూడిన కఠినమైన ట్రాక్‌ను దాటాల్సి ఉంటుంది. ఈ పరుగు పందెంలో గెలిచిన ప్రతీ జంటకు నిర్వాహకులు భార్య శారీరక బరువుకు సమానమైన బీరును బహుమతిగా ఇస్తారు. అంటే అంతపొడవైన బీరు సీసా ఉండాలనేమీ లేదు. సమానమైన బరువు తూగేలా బీరు పానీయాన్ని లీటర్ల రూపంలోనూ ఇవ్వొచ్చు. సరదాతో పాటు కిక్కు ఉంటుందని చాలామంది జంటలు ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంటాయి. స్థానిక ప్రజల ప్రకారం వైఫ్ క్యారీయింగ్ రేస్ అనేది 19 శతాబ్దంలోని ఒక ఇతిహాస కథనం నుంచి ప్రేరణ పొంది, కొనసాగుతూ వస్తోంది. ఇది కేవలం పోటీలో గెలిచే ఉద్దేశం మాత్రమే కాదు, జంటల మధ్య ప్రేమాను రాగాలను పెంపొందించే వరల్డ్ ఈవెంట్‌గా ప్రసిద్ధి చెందింది.






