రాముడు, హనుమాన్ విగ్రహాలపై దాడి.. వెలుగులోకి షాకింగ్ వీడియో !

by velandi.Saikiran |

ముగ్గురు కుర్రాళ్ళు.. రాముడి విగ్రహాన్ని చేతులతో దారుణంగా కొట్టిన వీడియో వైరల్ గా మారింది. అలాగే హనుమంతుని విగ్రహం పైన

రాముడు, హనుమాన్ విగ్రహాలపై దాడి.. వెలుగులోకి షాకింగ్ వీడియో !
X

దిశ, వెబ్ డెస్క్ : తాగిన మైకంలో ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. రాముడు అలాగే హనుమంతుని విగ్రహం పై దాడి కూడా చేశారు. ఎవరు లేని సమయం చూసి.. విగ్రహాల పట్ల అనుచితంగా వ్యవహరించారు ఈ ముగ్గురు దుర్మార్గులు. నాలుగో వ్యక్తి వీళ్ళ అరాచకాన్ని.. వీడియో రికార్డ్ చేశాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ ( Chhattisgarh) రాష్ట్రంలోని ఓ అడవి ప్రాంతంలో జరిగింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నవగావ్ ప్రాంతం దగ్గర ఉన్న ఓ అడవి ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా వినియోగించుకుంటున్నారు. అయితే అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. కొన్ని విగ్రహాలు స్వయంగా బయటపడ్డవి ఉన్నాయి. అయితే.. ఈ ప్రాంతంలో రాముడు అలాగే హనుమంతుని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.

ఈ తరుణంలో తాగిన మైకంలో ముగ్గురు కుర్రాళ్ళు.. రాముడి విగ్రహాన్ని చేతులతో దారుణంగా కొట్టిన వీడియో వైరల్ గా మారింది. అలాగే హనుమంతుని విగ్రహం పైన ఎక్కి కూర్చున్న కుర్రాళ్ళు... నాన రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో... బయటకు రావడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ కుర్రాళ్లపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter Link


Next Story