- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏం గుండెరా వాడిది..! ఏకంగా నడి రోడ్డుపైనే.. మద్యం మత్తులో బీభత్సం
కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నడి రోడ్డుపై హంగామా సృష్టించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నడి రోడ్డుపై హంగామా సృష్టించాడు. పీకలదాకా మద్యం సేవించిన అతడు రోడ్డుపై కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, ‘నాగిని’ డాన్స్ చేస్తూ వచ్చేపోయే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు.
అకస్మాత్తుగా రోడ్డుపై ఇలా ప్రవర్తించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, మరింత అల్లరి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ప్రజా స్థలాల్లో ఇలాంటి ప్రవర్తన ప్రమాదాలకు దారితీస్తుందని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరో వైపు నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. నడిరోడ్డుపై పెద్ద వెహికల్స్ వస్తున్న తనకు భయం లేదని, ఏం గుండెరా వాడిది.. 90 ఎఫెక్ట్ అని మరికొంత మంది నెటిజన్‌లు కామెంట్ చేశారు.






