నిద్రమత్తులో కారును గోడ ఎక్కించిన డ్రైవర్..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

నిద్ర‌మ‌త్తులో రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం సాధార‌ణం. అలాంటి ప్ర‌మాదాలు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. కానీ ఓ డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో కారును ఏకంగా గోడ‌పైకి ఎక్కించాడు.

నిద్రమత్తులో కారును గోడ ఎక్కించిన డ్రైవర్..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నిద్ర‌మ‌త్తులో రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం సాధార‌ణం. అలాంటి ప్ర‌మాదాలు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. కానీ ఓ డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో కారును ఏకంగా గోడ‌పైకి ఎక్కించాడు. ఈ ఘ‌ట‌న మ‌రెక్క‌డో జ‌ర‌గ‌లేదు. మేడ్చ‌ల్ జిల్లా దుండిగ‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటు చేసుకుంది. శంభీపూర్ లో నిద్ర‌మ‌త్తులో డ్రైవ్ చేస్తూ వ‌చ్చిన డ్రైవ‌ర్ కారును ఇంటిగోడ‌పైకి ఎక్కించాడు. ప్ర‌మాదం జ‌ర‌గ‌టంతో వ‌చ్చిన శ‌బ్ధానికి య‌జ‌మానాలు చూసి నిద్ర‌లేవ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయారు. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డ‌కు చేరుకుని క్రేన్ స‌హాయంతో కారును కింద‌కు దింపారు. ప్ర‌స్తుతం కారుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పెడుతున్నారు. అస‌లు అక్క‌డ ఎలా పెట్టావ్ బ్రో.. అత‌నికి మ‌రో క్వార్ట‌ర్ ఇస్తే గోడ‌పై ఎలా పెట్టాడో అలానే దింపేవాడుగా అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. video

Next Story