దగ్గు సిరప్ బాటిల్స్ షెల్ఫ్‌లో పెడుతున్నారా..? జాగ్రత్త

by Ajay Maddhiboyina |

సాధార‌ణంగా ఇంట్లో సిర‌ప్ బాటిల్స్ వాడిన తరవాత ఎక్కడైనా షెల్ఫ్‌లలో పెడుతుంటారు. అలా పెట్టి కొన్ని నెలల పాటు కూడా వాడుతుంటారు. కానీ దగ్గు సిరప్‌లను అలా షెల్ఫ్‌లలో వదిలేయడం ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దగ్గు సిరప్ బాటిల్స్ షెల్ఫ్‌లో పెడుతున్నారా..? జాగ్రత్త
X

దిశ‌, వెబ్ డెస్క్: సాధార‌ణంగా ఇంట్లో సిర‌ప్ బాటిల్స్ వాడిన తరవాత ఎక్కడైనా షెల్ఫ్‌లలో పెడుతుంటారు. అలా పెట్టి కొన్ని నెలల పాటు కూడా వాడుతుంటారు. కానీ దగ్గు సిరప్‌లను అలా షెల్ఫ్‌లలో వదిలేయడం ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా వదిలేయడం వల్ల మూత వద్ద పేరుకుపోయిన సిరప్ ను బల్లి నాకడం, లేదా ఇంట్లో ఉండే బొద్దింకలు, ఇతర కీటకాలు తినడం లాంటివి చేస్తుంటాయని చెబుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో మూత వద్ద పేరుకుపోయిన సిరప్ ను బల్లి నాకుతున్నట్టు కనిపిస్తోంది.

అలా బల్లి నాకిన సిరప్ లను చిన్నపిల్లలకు ఇచ్చినా, పెద్దవాళ్లు తాగినా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సిరప్ వాడిన తరవాత బాలిల్ ను శుభ్రంగా తుడిచి, మూత గట్టిగా పెట్టి సురక్షితమైన కబోర్డులు లేదా ప్రత్యేక బాక్సుల్లో పెట్టి క్లోజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే రోగం తగ్గటానికి సిరప్ తాగితే కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక సాధారణంగా సిరప్ లు పెద్దవారి కంటే చిన్నపిల్లలకే ఎక్కువగా ఇస్తుంటారు. కాబట్టి చిన్నపిల్లలకు సిరప్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లు సులభంగా ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంది కాబట్టి మెడిసిన్స్ కోసం ప్రత్యేకంగా ఒక డబ్బా పెట్టుకుని అందులో వేయడం ఉత్తమం.

Next Story