- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Al-Ayyala: ‘అల్-అయ్యాలా’ నృత్యం.. జుట్టు విరబోసుకున్న బాలికలతో ట్రంప్‌కు స్వాగతం.. ఏంటో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తాజాగా పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మొదట యూఏఈ చేరుకోగానే అక్కడి సంప్రదాయ హెయిర్ ఫ్లిప్ నృత్యం (Al-Ayyala) అల్ అయ్యాలాతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలూ కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బాలికలు తెల్లటి బట్టలు ధరించి జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌కు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ నృత్యం ఆకట్టుకుంది. ఇలాంటి స్వాగతం ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తెగ సెర్చ్ చేస్తున్న నెటిజన్లు..
ఈ నృత్యం ఏమిటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ సంప్రదాయం నృత్యం ఏమిటో తెలుసుకుందాం. యునెస్కో, యూఏఈ నెటిజన్ల ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్‌లలో ప్రసిద్ధి చెందిన అతి పురాతన సంప్రదాయ నృత్యం. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) లో, రాజులు, దేశాధినేతలు లేదా అత్యున్నత స్థాయిలో ఉన్న పెద్దలు వచ్చినప్పుడు ఇచ్చే ఉత్సవ స్వాగతంలో భాగంగా ఈ నృత్యం చేస్తారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి జుట్టును విరబోసుకుని, సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. ఇక ఇలాంటి స్వాగతం సాధారణంగా ఎవరికీ దక్కదని యూఏఈ నెటిజన్లు చెబుతున్నారు.






