వంట పాత్రల్లో మూత్రం పోసిన పని మనిషి.. ఆ తర్వాత ఛీ..ఛీ.. (వీడియో)

by Sujitha Rachapalli |

యజమానులు పని మనుషులు నమ్మకంగా ఉంటారని భావిస్తారు. ఒక్కోసారి ఇల్లు మొత్తాన్ని అప్పగించి కూడా వెళ్తారు. ముఖ్యంగా కిచెన్‌లో పని చేసే వాళ్లకు మంచి ప్రయారిటీ దొరుకుతుంది. కడుపు నిండేలా చేస్తున్నారని మరింత ప్రేమతో మసులుకునేవాళ్లు ఉన్నారు. తమ ఫ్యామిలీలో

వంట పాత్రల్లో మూత్రం పోసిన పని మనిషి.. ఆ తర్వాత ఛీ..ఛీ.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : యజమానులు పని మనుషులు నమ్మకంగా ఉంటారని భావిస్తారు. ఒక్కోసారి ఇల్లు మొత్తాన్ని అప్పగించి కూడా వెళ్తారు. ముఖ్యంగా కిచెన్‌లో పని చేసే వాళ్లకు మంచి ప్రయారిటీ దొరుకుతుంది. కడుపు నిండేలా చేస్తున్నారని మరింత ప్రేమతో మసులుకునేవాళ్లు ఉన్నారు. తమ ఫ్యామిలీలో ఒకరిగా భావించేవాళ్లూ ఉన్నారు. కానీ ఈ వీడియో చూస్తుంటే.. కొందరు ఇలాంటి ప్రేమకు అర్హులు కాదని అనిపిస్తుంది. నమ్మకానికి ద్రోహం చేసే ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధించినా పర్లేదు అనే అభిప్రాయం కలుగుతుంది. విషయం ఏమిటంటే.. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లోని నగినా ప్రాంతానికి చెందిన ఓ హౌజ్ మేడ్ వంట పాత్రలు శుభ్రం చేసే క్రమంలో దారుణమైన పని చేసింది. వంట గదిలో ఉన్న గ్లాసు తీసుకుని.. అందులో మూత్రం పోసిన ఆమె.. దాన్ని ఇతర పాత్రలపై కూడా చల్లిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా సమంత్ర అనే పని మనిషిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నగినా పీఎస్‌లో కేసు నమోదు చేయబడిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు.

VIDEO

Next Story