- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pet dogs : పెట్ డాగ్స్ ఎందుకని మనిషి శరీరంలోని ఆ పార్ట్‌ను మాత్రమే ఎక్కువగా వాసన చూస్తాయి..?
Pet dogs : పెట్ డాగ్స్ ఎందుకని మనిషి శరీరంలోని ఆ పార్ట్‌ను మాత్రమే ఎక్కువగా వాసన చూస్తాయి..?

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా ప్రత్యేకించి గమనించారా..? ఒక్కోసారి పెట్ డాగ్స్ ప్రవర్తన వింతగా ఉంటుంది. యజమాని లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులతో సరదాగా ఆడుకుంటూ ఆశ్చర్య పరుస్తుంటాయి. దీంతోపాటు అవి తరచుగా మనుషుల ప్రైవేట్ పార్ట్స్ వాసన చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అలా చేయకుండా ఉండలేవట.. అందుకు సంబంధించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎందుకలా.. ? అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.
మనిషి శరీర భాగంలోని ఆ పార్ట్ వాసన ఒక్కసారైనా చూస్తే గానీ పెట్ డాగ్స్ (Pet dogs) హ్యాపీగా ఉండలేవు. అలా చూశాక అవి మరింత యాక్టివ్‌గా బిహేవ్ చేస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎందుకలా చేస్తాయంటే.. అది వాటి శరీర నిర్మాణ/ ధర్మ శాస్త్రంలో, సహజమైన ప్రవర్తనలో భాగం అంటున్నారు. మరొక విషయం ఏంటంటే.. కుక్కల్లో సహజంగానే వాసనను గ్రహించే శక్తి (Sense of smell) మనుషులకంటే ఎక్కువ. అంతేకాకుండా వాసన ద్వారా అవి వ్యక్తి గురించిన సమాచారాన్ని సేకరించి, గుర్తుంచుకోవడానికి ప్రైవేట్ పార్ట్స్‌ను మరింత ఎక్కువగా వాసన చూడాలని భావిస్తాయి. ఎందుకంటే ఈ భాగాల్లో స్వేద గ్రంథులు (Apocrine glands) ఎక్కువ ఉంటాయి.
మనుషుల ప్రైవేట్ పార్ట్స్(Private parts)లో ఉండే స్వేద గ్రంథులు ఫెరోమోన్‌లను విడుదల చేస్తాయి. ఇవి సదరు వ్యక్తుల హెల్త్, జెండర్ ( gender), హార్మోన్ లెవెల్స్, ఆకర్షణ, ఆనందం వంటి భావోద్వేగ స్థితి గురించిన సమాచారాన్ని అందిస్తాయి. పెట్ డాగ్స్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వాసనలను గ్రహిస్తాయి. అయితే మనుషుల ప్రైవేట్ పార్ట్స్ బలమైన, ప్రత్యేకమైన వాసనలను విడుదల చేస్తాయి కాబట్టి, కుక్కలు శరీరంలోని ఆ భాగం వైపు ఎక్కువ ఆకర్షితమవుతాయి.






