వామ్మో.. 40 ఏండ్లుగా గర్భంతోనే ఉన్న మహిళ.. 82 ఏండ్ల వయసులో నొప్పులు రాగా..!!

by Javid Pasha |

ఏడు కాదు, తొమ్మిది కాదు, 40 ఏండ్ల గర్భవతికి నొప్పులు రాగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అసలు విషయం తెలిసి డాక్టర్లే షాక్..!

వామ్మో.. 40 ఏండ్లుగా గర్భంతోనే ఉన్న మహిళ.. 82 ఏండ్ల వయసులో నొప్పులు రాగా..!!
X

దిశ, ఫీచర్స్ : నమ్మశక్యం కానీ నిజాలు కూడా కొన్నుంటాయి. అప్పుడప్పుడూ వినిపిస్తూ.. కనిపిస్తూ.. ఎదురవుతూ.. మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అదెలా సాధ్యమనే ఆలోచనలో పడేస్తుంటాయి. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆమె వయసు 82 సంవత్సరాలు. ఒక్కసారిగా భరించలేని కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బహుశా లోపల కణితి ఉంటుందని డాక్టర్లు భావించారు. కానీ స్కానింగ్ తర్వాత అసలు విషయం తెలిసి.. ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఎందుకంటే.. ఆమె శరీరంలో 40 ఏండ్లకు పైగా ఒక కాల్సిఫైడ్ గర్భస్థ శిశువు(Calcified fetus) ఉంది. అంటే 40 ఏండ్లుగా గర్భం(Pregnant for 40 years)తో ఉందన్నమాట. ఈ అరుదైన పరిస్థితినే వైద్య పరిభాషలో లిథోపెడియన్(Lithopedian) లేదా ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారు. సదరు మహిళకు నాలుగు దశాబ్దాల క్రితం ఎక్టోపిక్ గర్భం ఏర్పడిందని నిర్ధారించారు. అంటే గర్భస్థ శిశువు గర్భాశయంలోపల కాకుండా, వెలుపల అభివృద్ధి చెందింది.

‘స్టోన్ బేబీ’ గర్భధారణ కారణంగా సదరు మహిళకు అందరిలా పురిటి నొప్పులు రావడం, బిడ్డను కనడం వంటి పరిస్థితి ఎదురు కాలేదు. పైగా ఈ సంక్రమణను నిరోధించేందుకు అనుగుణంగా ఆమె శరీరం గర్భస్థ శిశువును కాల్షియంతో ఆవరించి, ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫలితంగా శిశువు గర్భాశయం వెలుపలి భాగంలో ఒక మమ్మీసైడ్ రూపంగా మారి, నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎటువంటి గర్భస్థ లక్షణాలను కనబర్చలేకపోయింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 300 లిథోపెడియన్ కేసులు (Lithopedian cases) మాత్రమే నమోదయ్యాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే పూర్తి వివరాలైతే లేవు కానీ, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Link

Next Story