వీడియో: ‘ఏమీ పీకలేవ్’.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు డాక్టర్ వార్నింగ్.. అక్కడున్నోళ్ల ఫీజులు ఔట్!

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-25 14:18:41  IST  )

ఉత్తరప్రదేశ్ సుభస్పా ఎమ్మెల్యే బేదీ రామ్‌కు వింత అనుభవం ఎదురైంది. జఖానియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన.. ఆస్పత్రి వాతావరణం మురికిగా ఉండటం, సిబ్బంది అందుబాటులో లేకపోవడం

వీడియో: ‘ఏమీ పీకలేవ్’.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు డాక్టర్ వార్నింగ్.. అక్కడున్నోళ్ల ఫీజులు ఔట్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సుభస్పా ఎమ్మెల్యే బేదీ రామ్‌కు వింత అనుభవం ఎదురైంది. జఖానియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన.. ఆస్పత్రి వాతావరణం మురికిగా ఉండటం, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, పేషెంట్లను సరిగ్గా ట్రీట్ చేయకుండా బయట నుంచి మందులు తెచ్చుకోవాలని బెదిరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాల గురించి ఇంచార్జ్ డాక్టర్ యోగేంద్ర యాదవ్‌ను నిలదీయగా రివర్స్‌లో చిందులేశాడు. ‘నీలాంటి ఎమ్మెల్యేలను మస్త్ మందిని చూశా.. ఏం చేసుకుంటావో చేసుకో.. నేను రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యేను బెదిరించి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు అధికారులు. సీహెచ్‌సీ ఇంచార్జి డాక్టర్‌గా తొలగించి సీఎంఓ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.

VIDEO

Read More..

మహిళలను బలి తీసుకుంటున్న వరకట్న ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది ? ఆడపిల్ల పెళ్లి చేస్తే కట్నమివ్వాల్సిందేనా?

Next Story