- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 బజ్జీలు తింటే కారణజన్ముడు అవుతాడా? సోషల్ మీడియాలో ఒకటే గోల గోల
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బజ్జీల పోస్టులే కనబడుతున్నాయి. 40 బజ్జీలు తింటే కారణజన్ముడు అవుతాడా? అంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ వేస్తున్న పోస్టులు. కాగా పొద్దున లేచిన వెంటనే ఏం చేస్తారు?

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బజ్జీల పోస్టులే కనబడుతున్నాయి. 40 బజ్జీలు తింటే కారణజన్ముడు అవుతాడా? అంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ వేస్తున్న పోస్టులు. కాగా పొద్దున లేచిన వెంటనే ఏం చేస్తారు? టిఫిన్, లంచ్, డిన్నర్‌లో ఏం తింటారు? వరకు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా బజ్జీల మ్యాటర్ తీస్తూ దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? అంటే మెగా ఫ్యాన్స్. అవును.. మెగాస్టార్ చిరంజీవి జిలేబి తినడం గురించి విమర్శిస్తూ నందమూరి ఫ్యాన్స్ పోస్ట్ పెట్టగా.. మెగా ఫ్యాన్స్ ఏకంగా సీనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. కారణజన్ముడు అయ్యాడంటే ఏమో అనుకున్నాం కానీ బజ్జీలు తినడం వల్లేనా అంటూ ఆ పెద్దాయన పురువు తీస్తున్నారు.
ఇది ఎంత వరకు దారి తీసిందంటే.. జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ కూడా కారణజన్ముడు అవ్వాలనుకుంటున్నారా అయితే మిరపకాయ బజ్జీలు ఆర్డర్ చేసుకోండి అని నోటిఫికేషన్స్ ఇచ్చేంత వరకు వెళ్లింది. అలాగని మెగా ఫ్యాన్స్ ఇక్కడితో ఆగిపోలేదు. సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో భారీగా పాలిటిక్స్ నడిపాడని.. తోటి నటీనటులకు రెస్పెక్ట్ ఇవ్వలేదని.. ఇగోయిస్టిక్ అని.. కొడుకు బాలకృష్ణను లేపేందుకు ఎంతో మందిని అణిచివేశాడని.. పోస్టులు పెడుతున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ మెగాస్టార్ పరువు తీసేందుకు ఉదయ్ కిరణ్ మ్యాటర్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా ఈ మ్యాటరే నడుస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బజ్జీల గోలనే వినిపిస్తుంది.
దీంతో విసిగిపోయిన కొందరు న్యూట్రల్స్ ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయడం మంచిదని సూచిస్తున్నారు. తెలుగు జాతికి గర్వకారణమైన ఆ పెద్దాయనను ఇంత దారుణంగా విమర్శించాలా అంటున్నారు. ఆయనకు జీర్ణించుకునే శక్తి ఉంది కాబట్టి నలభై బజ్జీలు కాదు వంద బజ్జీలు తింటాడు. కనీసం ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను అయినా గుర్తించి ఇక ఈ ట్రోలింగ్ ఆపేయాలని కోరుతున్నారు.
Read More: Party Combo : సుక్క.. ముక్క లేనిదే రోజు గడవదా ‘పుష్పా’..! ఎంత డేంజరో తెలుసా!!






