Viral Video : దాహంతో అల్లాడిన కోతి ఏం చేసిందో తెలుసా..? వీడియో వైరల్

by Muthe.Rajitha |

దాహంతో అల్లాడిపోయిన కోతి(Thristy Monkey) ఏం చేసిందో తెలిస్తే అవాక్కవాల్సిందే.

Viral Video : దాహంతో అల్లాడిన కోతి ఏం చేసిందో తెలుసా..? వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : దాహంతో అల్లాడిపోయిన కోతి(Thristy Monkey) ఏం చేసిందో తెలిస్తే అవాక్కవాల్సిందే. ఎంతసేపు నీళ్ళ కోసం వెతికిందో గాని ఇక లాభం లేదని, అక్కడే నిలబడిన స్కూల్‌ విద్యార్థి బ్యాగ్‌ నుంచి వాటర్‌ బాటిల్‌ తీసుకునేందుకు అది ప్రయత్నించింది. అయితే తన కుమారుడి స్కూల్‌ బ్యాగ్ పైకి కోతి దూకడాన్ని అతడి తల్లి చూసింది. కొడుకు భద్రతతోపాటు ఆ కోతి దాహాన్ని గుర్తించి... వెంటనే కుమారుడి స్కూల్‌ బ్యాగ్‌ నుంచి వాటర్‌ బాటిల్‌ను ఆమె తీసిం దాహంతో అల్లాడిపోయిన ఆ కోతికి నీటిని తాగించింది. దాహం తీరిన ఆ కోతి అక్కడి నుంచి దూరంగా వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు ఆ తల్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోతి దాహం తీర్చిన విద్యార్థి తల్లిని విపరీతంగా మెచ్చుకుంటూ.. ఎంతైనా తల్లి తల్లేనని కొందరు కామెంట్ చేస్తే.. ఎవరి అవసరాలు ఏమిటో అన్నది మాతృమూర్తులు గ్రహించి వాటిని తీరుస్తారని మరికొందరు ప్రశంసించారు.

Next Story